ఈ చిత్రంలో కత్రినాతో పాటు మరో ముఖ్యమైన పాత్రలో విక్కీ కౌషల్ నటిస్తాడని తెలుస్తోంది. సూపర్ ఉమెన్ తరహా ఫ్రాంఛైజీ ఇది. తర్వాతి పార్ట్ లో సల్మాన్ ఖాన్ లాంటి హీరోలు నటిస్తారని ఇంతకుముందు దర్శకుడు జాఫర్ క్లూ ఇచ్చాడు కూడా. ఇన్నాళ్లు హాలీవుడ్ సూపర్ హీరో సినిమాల్లో సూపర్ గర్ల్స్ విన్యాసాలు చూసి ఆశ్చర్యపోయాం. వండర్ ఉమెన్ .. క్యాట్ ఉమెన్.. పాంథర్ ఉమెన్ లను చూసి అద్భుతం అనుకున్నాం. ఇప్పుడు అలాంటి అద్భుతాన్నే చేయడానికి సిద్ధమైంది కత్రినా కైఫ్.ది గ్రేట్ యాక్షన్ క్వీన్ అథ్లెటిక్ బ్యూటీ కత్రినా కైఫ్ సూపర్ మేన్ మూవీలో నటిస్తుండడం ఆసక్తిని పెంచుతోంది. క్యాట్ అబుదాబిలో సూపర్ హీరో చిత్రం షూటింగ్ కోసం సిద్ధమవుతోంది. సినిమా కథాంశం ప్రకారం... బేస్ మార్చామని జాఫర్ తెలిపారు. "ఎందుకంటే ఈ చిత్రానికి అంతర్జాతీయ నటీనటులు సిబ్బంది ఉన్నారు. షూటింగ్ అబుదాబిలో చేయాలి కాబట్టి మేము ఇక్కడ నుండి దుబాయ్ లో మా ప్రీ-ప్రొడక్షన్ కోసం పని చేస్తున్నాము. దుబాయ్ లో పనిచేస్తున్న మాలో ఇరవై మంది బృందం నిరంతరం పని చేస్తోంది" అని అలీ అబ్బాస్ జాఫర్ చెప్పారు. ఇక ఈ మూవీకి కత్రినా తప్ప వేరొకరిని ఊహించుకోలేదని ఆయన అన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి