బాలక్రిష్ణ నందమూరి వారి వారసుడు. తండ్రి లెగసీని ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలబెడుతూ నాలుగు పదుల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్నాడు. సెంచరీ కొట్టినా నాట్ అవుట్ అంటున్నాడు. బాలయ్య బోయపాటి మూవీ ఇపుడు సెట్స్ మీద ఉంది. ఈ మూవీ మీద చాలా హోప్స్ అయితే ఫ్యాన్స్ లో ఉన్నాయి. ఇక మరో వైపు చూస్తే బాలయ్య వరసగా తరువాత సినిమాలను కూడా లైన్లో పెట్టేస్తున్నారు. బి గోపాల్ లాంటి సీనియర్ డైరెక్టర్ తో మూవీ ఉంటుందని అంటున్నారు. అలాగే వినాయక్ బాలయ్య మూవీ కూడా రెడీట.

అదే విధంగా స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తో బాలయ్య మూవీ ఉందని తాజాగా టాక్. పూరీ బాలయ్య కోసమే ఒక మంచి కధను తయారు చేశారుట. నిజానికి పూరీ లాక్ డౌన్ టైంలో అయిదారు కధలు రెడీ చేసి పెట్టుకున్నారు. ఆయన వరసగా చిరంజీవి, బాలయ్య, నాగార్జునల కోసం అదిరిపోయే స్క్రిప్టులను సిధ్ధం చేసి ఉంచారని కూడా చెబుతున్నారు.

ఇందులో మొదట బాలయ్య చాన్స్ ఇస్తున్నారని తెలుస్తోంది. బాలయ్యతో పూరీ తీసిన పైసా వసూల్ మూవీ మేకర్స్ కి పైసలు విదల్చలేకపోయింది. అదే సమయంలో ఈ మూవీ కొత్త బాలయ్యను మాత్రం ఆవిష్కరించింది. బాలయ్యను అలాంటి రఫ్ రోల్ లో న్యూ లుక్ తో కంప్లీట్ యంగ్ గా అందంగా చూపించిన ఘనత మాత్రం పూరీ జగన్నాధ్ దే. దాంతోనే ఇంప్రెస్ అయిన బాలయ్య మళ్ళీ మంచి కధతో వస్తే మన కాంబోలో మూవీ ష్యూర్ అని చెప్పారు.


ఇపుడు మంచి కధతోనే పూరీ బాలయ్యను కలవబోతున్నారు. ఈసారి ఎలాంటి పరిస్థితుల్లోనూ సూపర్ హిట్ కొట్టాలని పూరీ ఫిక్స్ అయ్యారట. బాలయ్య కోసం మంచి కసి మీద ఆయన వర్క్ చేస్తున్నారు అంటున్నారు. మరి ఈ కాంబో తొందరలోనే సెట్స్ మీదకు వస్తుంది అంటున్నారు. అదే జరిగితే బాలయ్యను పూరీ ఇంకెలా చూపిస్తాడోనని నందమూరి ఫ్యాన్స్ అపుడే ఊహల్లోకి వెళ్ళిపోతున్నారు. ఈసారి ఈ ఇద్దరు బ్లాక్ బస్టర్ కొట్టాలని కూడా కోరుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: