బాలీవుడ్ సినీ ప్రపంచానికి కీలకంగా వ్యవహరించే ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ కు ...గోవా రాష్ట్ర ప్రజలకు.. క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా కరణ్ జోహార్ సారీ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ మధ్యకాలంలో ఎక్కువ వివాదాల్లో చిక్కుకుంటున్న ప్రముఖ ఫిలింమేకర్ కరణ్ జోహార్ ఇప్పుడు మరో సమస్యతో సతమతమవుతున్నాడు. అయితే అసలు ఏమి జరిగిందో తెలుసుకోవాలనుందా అయితే కింద ఇచ్చిన ఏపీహెరాల్డ్ ఆర్టికల్ ను చదివేయండి. ఒక సినిమా షూటింగ్ నిమిత్తం.... గోవా రాష్ట్రంలోని ఒక గ్రామంలో షూటింగ్ ముగించగా.. చిత్రీకరణ చేసే  సమయంలో  గ్రామంను చెత్తమయంగా చేసినందుకు గాను కరణ్ జోహార్, ధర్మ ప్రొడక్షన్స్ పై ఫిర్యాదు నమోదు అయ్యింది. ఇది ఖచ్చితంగా వారు చేసిన పనే అంటూ ఆరోపణలు చేశారు.

ఆ గ్రామంలోని స్థానికులు కొందరు సోషల్ మీడియా ద్వారా గ్రామంలో ధర్మ ప్రొడక్షన్స్ వారు వదిలి వెళ్లిన చెత్తను ఫొటోలు మరియు వీడియోలు తీసి షేర్ చేశారు. దాంతో గోవా ప్రభుత్వం మరియు అధికారులు ఈ విషయంపై సీరియస్ గా స్పందించి.. దీనికి మూల కారణమైన కరణ్ జోహార్ క్షమాపణ చెప్పాలంటూ అల్టిమేటం జారీ చేసింది.
గోవా వ్యర్థ పదార్థాల నిర్వహణ మంత్రి మైఖేల్ లోబో ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ... ధర్మ ప్రొడక్షన్ వారు చెత్త పడేసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయించకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఇందుకు గాను వారు గోవా రాష్ట్ర ప్రజలు అందరికీ సోషల్ మీడియా ద్వారా క్షమాపణ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. ఒకవేళ చెప్పని పక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.  లేదంటే వారు  జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కూడా తెలిపారు.

దీనికి స్పందించిన ధర్మ ప్రొడక్షన్స్ లైన్ ప్రొడ్యూసర్ దిలీప్ మాట్లాడుతూ మేము గోవాలోని నిరుల్ ప్రాంతంలో షూటింగ్ చేసిన విషయం నిజమే. కానీ  ప్రతి రోజు షూటింగ్ తర్వాత చెత్తను మేము పంచాయితీ వారు చెప్పిన ప్రాంతంలో వేసి వెళ్లేవాళ్లం. కాని ఆదివారం నాడు చెత్త సేకరణకు వాహనం రాకపోవడంతో అలాగే ఆ చెత్త అక్కడ ఉండి పోయింది. దీనిపట్ల మేము చింతిస్తున్నాం అంటూ ఆయన తెలిపాడు. అయినా సరే...ఈ  విషయంపై ధర్మ ప్రొడక్షన్స్ అధినేత అయిన కరణ్ జోహార్ స్పందించాల్సిందే అంటూ నెటిజన్లు ఆయన డిమాండ్ చేస్తున్నారు.... మరి దీనికి కరణ్ జోహార్ ఏమని సమాధానం ఇవ్వనున్నారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: