తెలుగు
సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు తెలియని వాళ్ళు ఉండరేమో.. అంతగా ఆయన ఫేమస్ అయ్యాడు
కృష్ణ వారసుడుగా
ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఆయన చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో
బ్లాక్ బస్టర్ హిట్స్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు..
మహర్షి సినిమా తర్వాత వరుస హిట్ సినిమాలలో నటిస్తూ అభిమానులను పోగేసుకుంతున్నారు.. ఇటీవల
మహేష్ బాబు నటించిన సరిలేరు నికేవ్వరు
సినిమా హిట్ ను ఎంజాయ్ చేస్తున్నా
మహేష్ ఇప్పుడు మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు..
ఆ
సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాడు..ముందుగా
వంశీ పైడిపల్లి తో
సినిమా అనుకున్నా కూడా అందుకు సంబంధించిన కథ సరిగ్గా లేకపోవడంతో ఆయన సినిమాను తర్వాత చేసేలా ప్లాన్ చేసుకున్నాడు మహేష్.. కాగా ఇప్పుడు గీతాగోవిందం ఫేమ్ దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో మరో
సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమానే సర్కార్ వారి పాట.. ఈ
సినిమా చిత్రీకరణలో
మహేష్ బిజీగా ఉన్నాడు..ఇప్పటివరకు ఈ
సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు , టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. దీంతో
సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి.
చిత్రీకరణ మొదలు పెట్టగానే లాక్ డౌన్ రావడంతో షూటింగ్ పనులను ఎక్కడిక్కడ ఆపేశారు..వచ్చే నెలలో ఈ
సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
దీపావళి సందర్భంగా పరశురామ్‌కు
మహేష్ విషెస్‌తోపాటు బహుమతులు కూడా పంపించాడు. వాటిని
పరుశురామ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. `మా
సూపర్‌స్టార్ మహేష్ బాబు నుంచి అందమైన కానుక. ఈ దీపావళిని నా జీవితంలోనే ప్రత్యేకమైనదిగా మార్చినందుకు ధన్యవాదాలు సర్. మీకు, మీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక
దీపావళి శుభాకాంక్షలు` అని
పరశురామ్ పేర్కొన్నాడు...
మహేష్ అన్న ఆ మాటలకు దర్శకుడు ఎమోషనల్ అయ్యాడు.. అందుకు సంబంధించిన పోస్ట్ ఒకటి సోషల్
మీడియా లో వైరల్ అవుతుంది..