ఒకప్పుడు స్టార్ యాంకర్స్ గా చలామణి అయినా వాళ్లలో అనిత చౌదరి ఒకరు. సాంప్రదాయకమైన బట్టలు మాత్రమే ధరించి కొన్నేళ్ల పాటు యాంకర్ గా స్థిరపడింది.  వెండితెర, బుల్లితెర అనే తేడా లేకుండా అన్నింటా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఒక పక్క యాకరింగ్ మరో పక్క సీరియల్స్, ఇవే కాకుండా సినిమాల్లో సహాయక నటి పాత్రాలు చేస్తూ తాను ఒక వర్సటైల్ అని నిరూపించుకుంది. ఛత్రపతి సినిమాలో ఓ సూరి యాడ ఉన్నవురా అంటూ భిన్నమైన యాసలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక అనిత కెరీర్ మాత్రం ఈటీవీ లో యాంకరింగ్ తోనే స్టార్ట్ అయ్యింది. ఆమె స్నేహితులు అనితకు తెలియకుండా పోటోలను ఈటీవీ ఆడిషన్స్ కి పంపించడం వల్ల ఆమె కెరీర్ మొదలు పెట్టింది. తర్వాత యాంకరింగ్ చేస్తూనే ఋతురాగాలు’,’అమృతం;  ‘కస్తూరి’, ‘నాన్న' వంటి సీరియల్స్ లో నటించింది. ఇక వెండితెరపైనా సంతోషం, ‘నువ్వే నువ్వే’ ‘ఛత్రపతి’ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కేరింత’ ‘గురు’ ‘మన్మధుడు’  వంటి సినిమాలతో సందడి చేసింది. ఇక ఒక వయసు వచ్చాక అన్ని మానేసి పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. అనిత భర్త విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుండటం వల్ల అనిత కూడా కొన్నాళ్ల పాటు కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టి విదేశాల్లో నివసిస్తుంది. ఆమెకు కెరీర్ ఇచ్చిన ఈటీవీ అమెరికాలో చేస్తున్న అభిరుచి వంటల ప్రోగ్రాం కి అక్కడి తెలుగు వారితో వంటలు చేయిస్తూ ప్రోగ్రాం నడిపిస్తుంది. ఇక అనితకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఆమె తన ఫ్యామిలీ తప్ప మరో లోకం లేదు అంటుంది. ఒకవేళ ఏదైనా మంచి అవకాశం వస్తే ఇండియా వస్తాను అంటూ చెప్తుంది అనిత. తాను ఇప్పటి వరకు ఏది ప్లాన్ చేసుకోలేదని, అన్ని దేవుడి ఇష్టప్రాకారమే జరుగుతున్నాయని, ఇకపై కూడా తాను ఎలాంటి  కొత్త ప్లాన్ వేయమని, అవకాశం కోసం ఎదురుచూస్తుంటాను అని ఒక ఇంటర్వ్యూ లో తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: