ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... తెలుగు చలన  చిత్ర  పరిశ్రమలో  ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వయంకృషితో అగ్రహీరోగా ఇండస్ట్రీ ని ఏలాడు  మెగాస్టార్ చిరంజీవి. ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్  కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు.. స్టార్ హీరోలుగా వెండితెరను ఏలుతున్న సమయంలో సినిమాల్లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి అంచెలంచెలుగా ఎదుగుగూ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరో అయ్యే  స్థాయికి చేరుకున్నారు. ఆయన అసలు పేరు కొణిదెల శివశంకర ప్రసాద్. మెగాస్టార్  ఆంజనేయస్వామికి వీరభక్తుడు.ఇక మెగాస్టార్  సినిమాల్లోకి వచ్చాక చిరంజీవిగా పేరు మార్చుకున్నారు.

చిరంజీవిని ముద్దుగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు చిరు అని పిలుస్తుంటారు. అయితే ఆయన్ని చిరు అని తొలిసారి ఎవరు పిలిచారో తెలుసా.. కళాతపస్వి దర్శకత్వంలో వచ్చిన ‘సప్తపది’ సినిమాలో నటించి మెప్పించిన నటుడు రవికాంత్.. ఆ తర్వాత చిరంజీవితో కలిసి ‘మంచు పల్లకి’లో రవి కాంత్  నటించాడు. ఆ సినిమా షూటింగు జరుగుతున్న సందర్భంలో చిరంజీవిని.. పూర్తి పేరుతో పిలవకుండా ముద్దుగా  ‘చిరు’ అంటూ  పిలిచారట రవికాంత్. అప్పటి నుంచి యూనిట్ సభ్యులు, ప్రముఖులు, స్నేహితులు అందరూ కూడా మెగాస్టార్ ని  చిరు అని పిలిచే వారట. అప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవికి ‘చిరు’ అనేది ముద్దుపేరుగా ఫిక్స్ అయిపొయింది.

ఆ తరం ఈ తరం అని లేకుండా ఎప్పుడు తన రేంజ్ ఏంటో చూపిస్తాడు మెగాస్టార్. ఎంత మంది స్టార్స్ వచ్చిన కాని మెగాస్టార్ మెగాస్టారే...ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం టాలెంటెడ్ దర్శకుడు కొరటాల శివ తో "ఆచార్య" సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తూ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా లో చిరు కి జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది...ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో మూవీ అప్ డేట్స్ తెలుసుకోండి....


మరింత సమాచారం తెలుసుకోండి: