అప్పట్లో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టి తొలి సినిమాతోనే శివ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన శ్రీమంతుడు మూవీ తీశారు శివ. అప్పట్లో మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టి ఆయనకు మరింత మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆపై ఎన్టీఆర్ తో తీసిన జనతా గ్యారేజ్, అలానే మరొక్కసారి మహేష్ తో తీసిన భరత్ అనే నేను సినిమాలతో మరొక రెండు సక్సెస్ లు అందుకున్న శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా తీస్తున్నారు.
ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే దీని తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో శివ ఒక సినిమా తీయనున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై మంచి సెటైరికల్ గా సాగె ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక విద్యార్థి నాయకుడిలాగా నటించనున్నట్లు టాక్. ఓవైపు ఆచార్య చేస్తున్న శివ, మరోవైపు అల్లు అర్జున్ మూవీ కోసం పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో నిమగ్నం అయ్యారని, అలానే ఈ సినిమాకు పని చేయబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా ఇప్పటికే పూర్తి అయినట్లు చెప్తున్నారు. ఈ విధంగా అటు మెగాస్టార్ తో ఆచార్య చేస్తూ ఇటు అల్లు అర్జున్ మూవీ వ్యవహారాలు కూడా చూస్తున్న శివ, తప్పకుండా ఈ రెండు సినిమాలతో కూడా మరొక రెండు సక్సెస్ లు ఆదుకుంటారని మూవీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది .మరి అది ఎంతవరకు జరుగుతుందో తెలియాలి అంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాలి.....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి