
కథలో ఓ రామ్ పాత్ర సాఫ్ట్‌గా, మంచి ఉద్యోగం చేసుకుంటూ క్లాస్‌గా కనిపిస్తుంటే.. మరో పాత్ర మాత్రం హత్యలు చేస్తూ పోలీసులకు చుక్కలు చూపిస్తుంటుంది. ఈ రెండు క్యారెక్టర్లు ఎందుకు ఎదురుపడ్డాయి..? అసలు రెండో పాత్ర హత్యలు ఎందుకు చేస్తోంది..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది.
స్రవంతీ మూవీస్ నిర్మించిన ఈ సినిమాను కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. కిషోర్ తిరుమల ఇంతకుముందు కూడా రామ్‌కు నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలతో మంచి హిట్‌లు ఇచ్చాడు. ఇప్పుడు వీరిద్దరి కలయికలో ముచ్చటగా మూడో చిత్రం వస్తుండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఈ చిత్రంలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ వంటి ముద్దు గుమ్మలు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. సినిమాను సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
ఇదిలా ఉంటే ఈ చిత్రంలో నివేద పోలీసాఫీసర్ పాత్రలో కనిపించింది. మణిశర్మ అందించిన పాటలు ఇప్పటికే విడుదలై విజయవంతమయ్యాయి. ప్రధానంగా హెబ్బా పటేల్ చేసిన ఐటం సాంగ్ సినిమా బాగుందనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుదో వేచి చూడాలి. ముఖ్యంగా రామ్ తన ద్విపాత్రాభినయంతో ఆసాతం అలరిసత్తాడా..? కథ ఎలా ఉండబోతోంది..? అనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది.