గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు అందరూ ఒకే ఫార్ములాని పాటిస్తారు. డిమాండ్ ఉన్నప్పుడు అందినంత తీసుకుంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోని 24 క్రాప్ట్స్ అందరకి ఉపయోగపడే సూత్రం ఇది. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ బ్యూటీ, స్టార్ హీరో సరసన ఆఫర్ ని అందుకుంది. అయితే తనకు వచ్చిన ఆ ఆఫర్ కి ఎగిరి గంతేయకుండా, తన రెమ్యునరేషన్ విషయంలోనూ చాలా తెలివిగా వ్యవహరించింది. మేటర్ లోకి వెళితే, ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. అక్కినేని నాగార్జునకు జోడీగా నటించే అవకాశాన్ని ఈ ముద్దుగుమ్మ సొంతం చేసుకున్నారనేది విశ్వసనీయ సమాచారం. కల్యాణకృష్ణను దర్శకునిగా పరిచయం చేస్తూ నాగార్జున నటించనున్న చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయన’. నిర్మాత రామ్మోహన్ కథ అందించిన ఈ చిత్రం త్వరలో సెట్స్‌కు వెళ్లనుంది. నాగార్జున ఇందులో డ్యూయర్ రోల్ చేస్తున్నాడు. స్టోరి డిమాండ్ మేరకు ఇందులో ఇద్దరు కథానాయికలు. ఓ నాయికగా ఇప్పటికే రమ్యకృష్ణను ఖరారు చేశారు. చాలా కాలం తర్వాత నాగార్జున, రమ్యకృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం ఇదే కావడంతో ఈ మూవీపై కొంత హైప్ క్రియేట్ కావడం ఖాయం అంటున్నారు. ఇక రెండో హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠిని తీసుకున్నట్లు తెలిసింది. అందాల రాక్షసి, దూసుకెళ్తా చిత్రాలతో కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న లావణ్య, ‘మనం’ చిత్రంలో నాగచైతన్య స్నేహితురాలిగా ఓ గెస్ట్ క్యారెక్టర్ చేసింది. ఇప్పుడు ఏకంగా నాగ్‌తోనే జతకట్టే ఛాన్స్ కొట్టేసిందంటే, నిజంగా లావ్యణ్య లక్కీనే. అయితే లావణ్య త్రిపాఠి ఇప్పటి వరకూ ఫుల్ లెన్త్ హీరోయిన్ గా చేసిన మూవీకి నలభై నుండి యాభై లక్షల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇప్పుడు నాగార్జున సరసన ఆఫర్ రావడంతో తన రెమ్యునరేషన్ ని పెంచుకొని 70 లక్షల వరకూ డిమాండ్ చేసిందంటూ టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: