అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల డైరక్షన్ లో వస్తున్న సినిమా నాంది. ఫిబ్రవరి 19న రిలీజ్ ఫిక్స్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ చేశారు. న్యాయం కోసం పోరాడే ఓ వ్యక్తి కథతో నాంది సినిమా వస్తుంది. ఇన్నాళ్లు తన కామెడీతో అలరించిన అల్లరోడు కెరియర్ లో ఫస్ట్ టైం ఫుల్ టైం సీరియస్ సబ్జెక్ట్ తో వస్తున్నాడు. ఈ సినిమా పోస్టర్స్ దగ్గర నుండి టీజర్ వరకు అన్ని ఆసక్తిగా ఉన్నాయి.

ఇక లేటెస్ట్ గా రిలీజైన ట్రైలర్ కూడా సినిమాపై భారీ అంచనాలు ఏర్పరచింది. ట్రైలర్ లో అల్లరి నరేష్ న్యూడ్ సీన్.. పర్ఫార్మెన్స్ అన్ని సినిమాకు హైలెట్ గా నిలిచేలా ఉన్నాయి. ఓ మర్డర్ కేసులో అనుమానితుడిగా అరెస్ట్ అయిన హీరో చేయని తప్పుకి శిక్ష అనుభవించాల్సి వస్తే.. ఈ సమస్యల నుండి ఎలా బయట పడ్డాడు అన్నది సినిమా కథ. ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తికరంగా ఉంది. నరేష్ నటన హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది.

తప్పకుండా అల్లరోడు ఈసారి నాంది సినిమాతో గట్టిగానే కొట్టేలా ఉన్నాడు. కొత్త దర్శకుడైనా విజయ్ ఎంచుకున్న కథకు న్యాయం చేసినట్టే అనిపిస్తుంది. అల్లరోడు నట విశ్వరూపంతో వస్తున్న ఈ నాంది ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. ఈ సినిమాలో కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా స్పెషల్ రోల్ లో నటించారు. సినిమాకు ఆమె కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారని తెలుస్తుంది. ఈమధ్యనే వచ్చిన మాస్ మహరాజ్ రవితేజ క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో ఆమె అదరగొట్టిన విషయం తెలిసిందే.                 
                   

మరింత సమాచారం తెలుసుకోండి: