ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను అలరించింది. ఇక సినిమా నుండి వచ్చిన లేటెస్ట్ థీమ్ పోస్టర్ సినిమాపై మరింత అంచనాలు పెంచింది. కళ్యాణ్ దేవ్ ఈసారి టార్గెట్ గట్టిగానే పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. అశ్వద్ధామ సినిమాతో టాలెంట్ చూపించిన రమణ తేజ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. నాగ శౌర్యతో చేసిన అశ్వద్ధామ కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు కాని సినిమా టేకింగ్ పరంగా డైరక్టర్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు కళ్యాణ్ దేవ్ తో రమణ తేజ కిన్నెరసాని అంటూ కొత్త ప్రయత్నం చేస్తున్నారు.
ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నారు. సినిమాకు సంబందించిన లేటెస్ట్ మోషన్ పోస్టర్ కూడా సినిమాపై సూపర్ క్రేజ్ వచ్చేలా చేసింది. కళ్యాణ్ దేవ్ కు కిన్నెరసానితో మొదటి హిట్ దక్కేలా ఉంది. ఈ సినిమాకు మణిశర్మ తనయుడు మహతి సాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయన మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా ఉందని చెప్పొచ్చు. ఈరోజు కళ్యాణ్ దేవ్ బర్త్ డే సందర్భంగా వచ్చిన కిన్నెరసాని పోస్టర్ ప్రేక్షకులను అలరించింది. మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి