ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ధూమ్ ఫోర్ లో దీపికా పదుకొనే నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దీపికా పదుకొనే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఓవైపు గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా చేసుకుంటూ దూసుకుపోతుంది. అయితే ఇప్పటివరకు దీపికా పదుకొనేను గ్లామర్ పాత్రల్లో ఎంతో మంది ప్రేక్షకులు చూశారు అంతేకాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో కూడా నటించి తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుని ప్రేక్షకులను మెప్పించింది దీపికా పదుకొనే.
కానీ ధూమ్ ఫోర్ లో మాత్రం ఇప్పటి వరకు నటించని సరికొత్త పాత్రలో నటించబోతున్నట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. అయితే ధూమ్ ఫోర్ తెరకెక్కించేందుకు ప్రస్తుతం మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉండగా ఇక ఈ సినిమాలో ప్రతినాయకురాలి పాత్ర గత సినిమాల కంటే ఎంతో భిన్నంగా ఉంది అనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ భిన్నమైన పాత్ర కోసం దీపికా పదుకునేను చిత్ర బృందం సంప్రదించగా తో ఇక పాత్ర నచ్చడంతో వెంటనే దీపికా కూడా ఓకే చెప్పేసిందట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి