కిక్ మూవీ గ్రాండ్ సక్సెస్ కావడంతో కిక్2 మూవీపై ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరిగింది. అయితే థియోటర్స్ వద్ద టికెట్స్ దొరకని అభిమానులు, సాధారణ సినీ ప్రేక్షకులు కిక్2 ఎలా ఉంది..కిక్ లాగే ఉందా? అంతకు మించి ఉందా? అంటూ ప్రతి ఒక్కరిని పదే పదే అడుగుతున్నాయి. అయితే సింగిల్ కట్ లో అడిగేవాళ్ళు మాత్రం కిక్2 హిట్టా? ఫట్టా? అంటూ క్లారిటి ఇవ్వమంటున్నారు.

ఇక థియోటర్స్ వద్ద కిక్2 కి సంబంధించిన క్లియర్ టాక్స్ లోకి వెళితే,2009లో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన కిక్ మూవీకి చేసిన సీక్వెల్ ‘కిక్ 2′. రవితేజ కిక్ తర్వాత మరోసారి సురేందర్ రెడ్డితో కలిసి చేసిన ఈ సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. సినిమా కి ఇప్పటివరకూ అందుతున్న రిపోర్ట్ లను బట్టి కంఫర్టబుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే మిక్సిడ్ టాక్ రన్ అవుతోంది. కంఫర్ట్ అనే కాన్సెప్టు తో వచ్చిన ఈ చిత్రం పూర్తి కంపర్ట్ ప్రాజెక్టు అంటున్నారు. మరి కొందరు మాత్రం అస్సలు కంఫర్టే లేదంటున్నారు.

కొందరు రవితేజ ఎనర్జీ బాగుందని అంటుంటే, కొందరు మాత్రం రవితేజ ఎనర్జీని అస్సలు వాడుకోలేదని అంటున్నారు. కథలో ఎక్కువభాగం రాజస్ధాన్ లోని విలాస్ పూర్ అనే గ్రామంలో జరుగుతుంది. ఎన్నారై అయిన రాబిన్ హుడ్ తన ఆస్దులు అమ్మకం కోసం ఇండియా వస్తాడు. అక్కడ రకుల్ ప్రీతితో ప్రేమలో పడతాడు. అలా ప్రేమలో పడితన రవితేజాకి ఓ ట్విస్ట్ పడుతుంది. ఆ ట్విస్ట్ ...విలీస్ పూర్ గ్రామానికి దారి తీస్తుంది. ఇక అసలు కథ అక్కడి నుండి మొదలవుతుంది. అయితే ఈ మొత్తం కథలో జనాలకి నచ్ఛని పాయింట్స్ విషయానికి వస్తే, సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ బాగా తక్కువ అవ్వడం. అలాగే సెకండాఫ్ మొదలైన అరంగంట వరకూ స్లోగా సాగడంతో ఆ ఎపిసోడ్ చాలా బోరింగ్ ఉందని అంటున్నారు.

క్లియర్ గా చెప్పుకుంటే, కిక్ 2 లో ఫస్ట్ హాఫ్ లో వర్కౌట్ అయినంతగా సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ లేకపోవడం మైనస్.కిక్ లోని ప్రతి ట్విస్ట్ వర్కౌట్ అయినట్టుగా, కిక్2లో అన్ని ట్విస్ట్ లు సరిగా వర్కౌట్ అవ్వలేదు. మొత్తంగా బాక్సాపీస్ వద్ద మాత్రం ప్రస్తుతం కిక్2 అధరగొడుతుంది. కలెక్షన్స్ పరంగా మొదటి వీకెంట్ రికార్డ్స్ చేయటం ఖాయం. తరవాత మాత్రం కొద్దిగా ఇబ్బంది పడాలి. కిక్2 చూసిన ప్రతి ఒక్కరూ.., ఎటూ తేల్చుకోలేకుండా ఎంజాయ్ చేశామనే కిక్ తో బయటకు వస్తున్నారనే టాక్ ప్రస్తుతం థియోటర్స్ వద్ద ఉంది. కొన్ని రోజుల తరవాత అయితే కాని క్లారిటి న్యూస్ బయటకు రాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: