1) సూర్య సన్ ఆఫ్ కృష్ణన్:
దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ క్లాసికల్ చిత్రం అని చెప్పవచ్చు. ఈ సినిమాలో నటించడం కోసం దర్శకుడు ముందుగా రామ్ చరణ్ ను సంప్రదించగా ఆ సమయంలో రామ్ చరణ్ మగధీర సినిమా చేస్తూ బిజీగా ఉండటంతో ఈ సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకున్నారు.
2) లీడర్:
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లీడర్ సినిమా కథ ముందుగా రామ్ చరణ్ కి చెప్పగా అందుకు రామ్ చరణ్ నో చెప్పడంతో ఈ సినిమా కథ బన్నీ దగ్గరికి కూడా వెళ్ళింది. బన్నీ కూడా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోకపోవడంతో ఫైనల్ గా సురేష్ ప్రొడక్షన్ లో రానా ఈ సినిమాలో నటించారు.
3) డార్లింగ్:
ప్రభాస్ కు మంచి గుర్తింపును సంపాదించిన సినిమా డార్లింగ్ అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో నటించే అవకాశం ముందుగా రామ్ చరణ్ కి రాగా,ఈ సినిమా చేయడం కోసం ప్రభాస్ అయితే బాగుంటుందని చరణ్ స్వయంగా చెప్పడంతో ఈ సినిమా చేసే అవకాశం ప్రభాస్ కి దక్కింది.
4) ఎటో వెళ్ళిపోయింది మనసు:
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నటించడం కోసం రామ్ చరణ్ కి కథ వినిపించినప్పటికీ రామ్ చరణ్ రెండవసారి కూడా గౌతమ్ మీనన్ సినిమాలో రిజెక్ట్ చేశారు. తరువాత ఈ సినిమాలో నాని నటించారు.
5) కృష్ణం వందే జగద్గురుమ్:
దర్శకుడు క్రిష్, చరణ్ ఎంతో మంచి స్నేహితులు ఈ సినిమాలో నటించడం కోసం క్రిష్ ముందుగా చరణ్ ను సంప్రదించగా.. ఈ సినిమాలో నటించడం కోసం రానా ఫైనల్ అయ్యారు.
6) శ్రీమంతుడు:
రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఈ ముగ్గురికి ఈ సినిమా కథను దర్శకుడు కొరటాల శివ వినిపించగా ఈ ముగ్గురు ఈ సినిమా చేయడం కోసం ఆసక్తి చూపించకపోవడంతో ఈ సినిమాను మహేష్ బాబు చేశారు. శ్రీమంతుడు సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో మనకు తెలిసిందే.
7) మనం:
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ క్లాసికల్ చిత్రంగా మనం సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమాలో నటించడానికి చరణ్ నో చెప్పడంతో తర్వాత మరికొంతమంది హీరోలను కూడా దర్శకుడు సంప్రదించారు. ఫైనల్ గా మనం సినిమా అక్కినేని కుటుంబం కోసమే రాసినట్టుగా ఉందిthana
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి