ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను అనుకున్న విధంగా హైదరాబాద్ లోని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో నిర్వహించగలిగితే ఈ మూవీ మ్యానియా మరింత పెరిగి ఉండేది. అయితే కోవిడ్ నిబంధనలు వల్ల ఈ ఫంక్షన్ కు అనుమతులు రాలేదు. ఇలాంటి పరిస్థితులలో దిల్ రాజ్ తన వ్యూహం మార్చి ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను హైటెక్ నోవాటెల్ ఓపెన్ ప్లేస్ లో జరపాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు ఈ ఈవెంట్ కు కూడ అనుమతులు రావలసి ఉంది. ప్రస్తుత పరిస్థితులలో కేవలం 500 మంది అతిధుల మధ్య ఫంక్షన్స్ చేసుకోవడానికి అనుమతులు ఇస్తున్నారు. అది కూడ కోవిడ్ ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుంది. అయితే ఒకసారి ఇలాంటి ఫంక్షన్ ను పవన్ అభిమానుల సంఖ్యను పూర్తిగా తగ్గించి నిర్వహిస్తే ఆ విషయం పవన్ అభిమానుల సహనాన్ని పరీక్షించే విషయంగా మారుతుంది.
దీనితో అసహనానికి లోనైన పవన్ అభిమానులు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోకుండా రబస చేసే ఆస్కారం ఉంది అని దిల్ రాజ్ భయం అని అంటున్నారు. దీనితో ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను అభిమానుల మధ్య భారీ ఎత్తున నిర్వహించ లేక కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ సింపుల్ గా ముగించలేక ఏమి చేయాలో తెలియక ఈ విషయంలో దిల్ రాజ్ అంతర్మధనంలో ఉన్నట్లు టాక్. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ‘వకీల్ సాబ్’ కు వచ్చిన క్రేజ్ కలక్షన్స్ రూపంలో మారకుంటే తీవ్ర నష్టం వాటిల్లుతుందని బయ్యర్లు భయపడుతున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి