ఇక భారీ శివుడి విగ్రహం.. దాని ముందు అఘోరా గెటప్ లో కనిపించే బాలయ్య విజువల్స్ ఆకట్టుకున్నాయి.ఇక నేల మీద నుండి త్రిశూలం గాల్లోకి లేపే సీన్ టెరిఫిక్ గా అనిపిస్తుంది.అదే త్రిశూలంతో ఫైట్ చేసే సన్నివేశాలను చూపించారు. ఇక 'హరహర మహాదేవ.. శంభో శంకర.. కాలు దువ్వే నందు ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది' అంటూ బాలయ్య త్రిశూలం పట్టుకొని చెప్పే డైలాగ్ టీజర్ కి హైలైట్ గా నిలిచింది. తమన్ అందించిన నేపధ్య సంగీతం టీజర్ ని మరింత ఎలివేట్ చేసి చూపించింది.ఇక ఈ సినిమా టీజర్ యూ ట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుపోతుంది. యూ ట్యూబ్ ట్రెండింగ్ లో టాప్ 1 లో ఈ టీజర్ దూసుకుపోతుంది. టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఖచ్చితంగా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంలా కనిపిస్తుంది. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి