తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి సంక్రాంతి సీజన్ తరువాత సమ్మర్ సీజన్ బిజినెస్ పరంగా  అత్యంత కీలకమైంది. గత సంవత్సరం కరోనా పుణ్యమా అని సమ్మర్ సీజన్ గాలిలో కలసిపోవడంతో ఈ సమ్మర్ సీజన్ కు భారీ సినిమాలు అన్నీ వరసగా తమ రిలీజ్ డేట్స్ ను చాలా ముందుగా ఫిక్స్ చేసుకున్నాయి.


ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ‘వకీల్ సాబ్’ తో సమ్మర్ సినిమాల జాతర మొదలై ఆతరువాత వరస పెట్టి  క్రేజీ సినిమాల హడావిడి కొనసాగుతుంది అని భావించి ఉమ్మర్ సినిమాల బిజినెస్ కూడ భారీ స్థాయిలో జరిగింది. ఇప్పుడు ఆ ఆశలను గల్లంతు చేస్తూ తెలుగు రాష్ట్రాలలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయికి  చేరుకోవడమే కాకుండా ఆంధ్ర ప్రాంతంలో కొత్తగా లో రేట్ల తంటా వచ్చి పడింది.  


అసలే కలెక్షన్స్ లేక దిగాలు పడిపోతున్న సినిమాలకు ఆంధ్రప్రాంతానికి చెందిన ఈ టికెట్ల రేట్ల నిబంధనలు నిర్మాతలను మరింత ఖంగారు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈనెల 16న రావాల్సిన ‘లవ్ స్టోరీ’ వాయిదా పడింది. 23న రావాల్సిన నాని ‘టక్ జగదీష్’ కూడ అదే దారి పట్టింది.  అదేవిధంగా ఈ నెలాఖరుకు రావలసిన  విరాటపర్వం కూడ వాయిదా పడటంతో ఈ నెలలలో రిలీజ్ అవుతున్న చెప్పుకోదగ్గ సినిమాలు లేవు.  


ఇక మే నెలలో రావలసి ఉన్న ‘ఆచార్య’ కూడ వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.  ఇలాంటి పరిస్థితులలో ఇక మిగిలి ఉంది. బాలయ్య అఖండసినిమా మాత్రమే. మే 28న విడుదల కావలసి ఉన్న ఈ సినిమాకు ఇంకా వర్క్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి పరిస్థితులలో మే నెలలో కూడ సరైన సినిమా విడుదలకు అవకాశం లేదు. ఈ పరిస్థితులలో కీలకమైన సమ్మర్ సీజన్ కరిగిపోయి ఇక పోస్ట్ సమ్మర్ సీజన్ మాత్రమే మిగిలి ఉంటే ఈ సీజన్ లో ఎన్ని సినిమాలు విడుదల అవుతాయి ఎన్ని సినిమాలు నిలబడ గలుగుతాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలు నిట్టూర్పులు విడుస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: