రెండో దశ కరోనా ఎవరినీ వదిలి పెట్టడం లేదు.. మొదటి దశలో రానీ ప్రతి ఒక్క వ్యక్తి కి కరోనా రెండో దశలో తన ప్రతాపం చూపిస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మొదటి దశ లో వచ్చిన వారికి కూడా కరోనా వస్తూ వారిని భయపెడుతోంది.. టీకా లు వేసుకున్న వారు కూడా కరోనా వస్తు వారిని భయబ్రాంతులకు గురి చేస్తుంది. ప్రముఖులను కూడా భయ పట్టిస్తున్నా ఈ వైరస్ తాజాగా కేటీఆర్ కు కూడా వచ్చింది..

తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి  కేటీఆర్ కూడా కోవిడ్ బారిన పడగా కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్ష చేయించుకో గా తనకు పాజిటివ్ వచ్చిందని స్వయం గా కేటీఆర్ వెల్లడించారు.. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.. తాను మైల్డ్ కరోనా తో బాధ పడుతున్నట్లు వివరించారు.. దీంతో ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపారు.. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు.. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు .. తాజా గా టాలీవుడ్ నటుడు చిరంజీవి సైతం ట్వీట్ చేశాడు..

ఆయన ట్వీట్ లో "ప్రియతమ కేటీఆర్.. మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను అంటూ చిరు ట్వీట్ చేశారు.. మెగాస్టార్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తుండగా, ఇప్పటికే సీఎం కేసీఆర్ కొవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.. దేశం లో కోవేట్ విజృంభణ తీవ్రస్థాయి లో కొనసాగుతోంది.. గడచిన 24 గంటల్లో దేశం లో సుమారు మూడు లక్షల ముప్పై మూడు వేల కేసులు నమోదు కాగా 2242 మంది ప్రాణాలు కోల్పోయారు...రాష్ట్రంలో నూ అదే పరిస్థితి నెలకొంది రోజుకు 5 నుంచి 6 వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: