తమిళ దర్శకులలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న యువ దర్శకుడు అట్లీ.. తొలి సినిమా నుంచే భారీ తనం ఉట్టిపడేలా సినిమాలు చేస్తూ కమర్షియల్ గా మంచి సక్సెస్ ను సాధించాడు. రోబో సినిమా కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి  ఆ తరువాత పలు సినిమాలకి శంకర్ వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేశాడు. తొలి సినిమా రాజా రాణి తోనే సూపర్ హిట్ అందుకున్నాడు అట్లీ.. భార్యభర్తల మధ్య ప్రేమానురాగాలను వైవిధ్యంగా చూపించి ఫ్యామిలీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు..

ఇక తాను చేసిన రెండో సినిమానే విజయ్ లాంటి సూపర్ స్టార్ తో చేసి తన విజయ పరంపర మొదలుపెట్టాడు.. వరుసగా మూడు సినిమాలు విజయ్ తో చేసి ఏ దర్శకుడికి దొరకని సువర్ణ అవకాశాన్ని పొందాడు. మూడిటికి మూడు సినిమాలు సూపర్ హిట్ సినిమాలే.. విజయ్ ని కూడా ఈ రేంజ్ లో ఏ దర్శకుడు చూపించ లేదనే చెప్పాలి.. డైరీ చిత్రం లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రేక్షకులను కనువిందు చేశాడు విజయ్.. ఆ తర్వాత వచ్చిన మెర్సల్ సినిమాలో త్రిబుల్ రోల్ లో ఆకట్టుకున్నాడు.. ఇక ఆ తర్వాత వచ్చిన బిగిల్ సినిమా తో విజయ్ నీ అట్లీ వేరే లెవల్లో చూపించాడని చెప్పవచ్చు..

కాదా ఈ టాలెంటెడ్ దర్శకుడి ఇంట్లో తాజాగా విషాదం నెలకొంది.. అట్లీ తాత గారు అయినా సౌందర పాండియన్ కన్నుమూసారు.. ఇందుకు సంబంధించి తన ట్విట్టర్లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు.. ఆయన తో దిగిన ఫోటోను షేర్ చేసిన అట్లీ నా తాత సౌందర పాండియన్ కన్నుమూసారు మా కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.. దీన్ని ఎలా అధిగమించాలో తెలియడం లేదు.. నేను ఆయనని ఎంతగానో ప్రేమిస్తాను.. ఎల్లప్పుడూ మా రాజు.. రోల్డ్ మోడల్.. లవ్ యు.. మిస్ యు.. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు అట్లీ తాత ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. అట్లీ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: