ఇటీవల
బాలీవుడ్ నటుడు
ముఖేష్ ఖన్నా చనిపోయారని సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. దీంతో తాను చనిపోలేదని.. తాను బతికున్నా కూడా చనిపోయానని ప్రచారం చేయడానికి మనసెలా వస్తుందని
ముఖేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దురదృష్టవశాత్తు తాను చనిపోలేదని క్లారిటీ ఇచ్చిన మరుసటి రోజే తన సోదరి కమల్ కపూర్ పోస్ట్ కోవిడ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. నిన్న
ముఖేష్ తాను చనిపోలేదని ఒక
గుడ్ న్యూస్ తో ఫ్యాన్స్ ని సంతోష పరిచినప్పటికీ ఇవాళ మాత్రం తన సోదరి చనిపోయిందని చెప్పి తీవ్ర విషాదానికి గురిచేశారు. అయితే తన సోదరి మరణం గురించి
ముఖేష్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక భావోద్వేగమైన పోస్ట్ పెట్టగా.. ప్రస్తుతం అది అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
"నిన్న నా మరణం గురించి వస్తున్న తప్పుడు వార్తల్లో నిజం లేదని చెప్పడానికి నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. కానీ ఒక భయంకరమైన నిజం నా కోసం ఎదురు చూస్తోందని తెలుసుకోలేకపోయాను. ఈరోజు నా ఒక్కగానొక్క అక్క కమల్ కపూర్ ఢిల్లీలో చనిపోయారు. ఆమె మరణానికి నేను బాగా చింతిస్తున్నాను. ఆమె 12 రోజుల పాటు కరోనాపై పోరాడి కరోనాను జయించారు. కానీ శ్లేష్మం/చీము ఊపిరితిత్తులలో పేరుకు పోయి బాగా ఉబ్బటం వల్ల ఆమె చనిపోయారు. దేవుడు ఎవరి తలరాతలు ఎలా రాస్తారో ఊహించలేము. నిజంగా, నా జీవితంలో తొలిసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. కన్నీటితో నమస్కరిస్తూ.. భావోద్వేగ హృదయంతో నివాళులు అర్పిస్తున్నాను" అని
ముఖేష్ ఖన్నా తన ఇన్‌స్టా పోస్ట్ లో పేర్కొన్నారు. అలాగే ఆయన తన అక్కయ్య తో దిగిన తన ఫ్యామిలీ ఫోటో షేర్ చేశారు.
ఇకపోతే బుల్లితెరపై ‘శక్తిమాన్’ గా, ‘మహాభారతం’ ధారావాహికలో భీష్ముడిగా నటించి అప్పటి బుల్లితెర ప్రేక్షకులను
ముఖేష్ ఖన్నా ఎంతగానో అలరించారు.
సుమంత్, సలోని
హీరో హీరోయిన్లుగా నటించిన ‘ధన 51’ సినిమాలో ఆయన ఒక పాత్ర పోషించారు.