
చారు అసోపా తన బేబీ బంబ్‌తో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం వారి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ‘‘ఎప్పటి నుంచో ఈ శుభవార్త కోసం ఎదురుచూస్తున్నాం. నేను గర్భవతినయ్యానని తెలియగానే రాజీవ్ చాలా సంతోషించాడు. నిజంగా మాకు ఇదొక సర్‌ప్రైజ్. మా జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలుకాబోతుంది. నవంబరులో డెలివరీ ఉంటుందేమో’’ అంటూ తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ నటి బికనీర్‌లో ఉన్నటువంటి తమ అమ్మ వాళ్లింట్లో ఉంటోంది. కరోనా వల్ల ముంబైలో కేసులు బాగానే ఉన్నాయి. అందుకే వారు బికనీర్లో మకాం మార్చారు. అయితే తన భర్త రాజీవ్ మాత్రం ముంబైలోనే ఉంటున్నట్లు ఈ నటి తెలియజేసింది. తన శరీరంలో రోజురోజుకూ మార్పులు వస్తున్నాయని, మాతృత్వాన్ని చాలా సంతోషంగా ఆస్వాదిస్తున్నానని ఆమె ఈ సందర్భంగా తెలియజేసింది. ఈ నటి పలు హిందీ సీరియళ్లలో నటించడమే కాకుండా బాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచేశారు. ప్రస్తుతం చారు అసోపా ఈ నటి మోడలింగ్ రంగంలో రాణిస్తున్నారు.