
ఆ తరువాత అసాధ్యుడు, విజయదశమి, లక్ష్మి కళ్యాణం వంటి సినిమాలు చేసిన కళ్యాణ్ రామ్ వాటితో ఆశించిన స్థాయి విజయాలు అయితే అందుకోలేకపోయారు. ఆపై కొన్నాళ్ల అనంతరం అనిల్ రావిపూడి తీసిన పటాస్ మూవీ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్లిన కళ్యాణ్ రామ్, అప్పటి నుండి ఆశించిన స్థాయి విజయాన్ని అయితే అందుకోలేకపోతున్నారు. గత ఏడాది ఎంత మంచివాడవురా మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సతీష్ వేగేశ్న తీసిన ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక లేటెస్ట్ గా కళ్యాణ్ రామ్ నటిస్తున్న సినిమాని వశిష్ట్ తీస్తుండగా ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ రూపొందిస్తోంది.
టైం ట్రావెల్ నేపథ్యంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నారని, అలానే ఈ మూవీకి తుగ్లక్, రావణ్ అనే రెండు పవర్ఫుల్ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. అయితే ఈ మూవీకి సంబంధించి కొద్దిసేపటి క్రితం యూనిట్ ఒక ప్రకటన విడుదల చేసింది. రేపు సీనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు తమ సినిమా అధికారిక టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయబోతున్నట్లు యూనిట్ తెలిపింది. మరి చాలా రోజుల నుండి సరైన సక్సెస్ కోసం పరితపిస్తున్న కళ్యాణ్ రామ్ ఈ మూవీతో ఎంతవరకు సక్సెస్ అందుకుంటారో చూడాలి ..... !!