
సూపర్‌స్టార్ కృష్ణ మరియు గల్లా అరుణ కుమారి సమర్పణలో, అమర రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై పద్మావతి గల్లా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను, టీజర్ ను ప్రిన్స్ మహేష్ బాబు విడుదల చేశారు. యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకొనేలా కథ ఉందని చిత్ర దర్శకులు చెప్పుకొచ్చారు.
టీజర్, టైటిల్ ఆసక్తిగా ఉందని, సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని మహేష్ బాబు అన్నారు. స్టార్ సింబల్, గన్, బుల్లెట్ తో పాటుగా అదిరిపోయే లుక్ ఉండటంతో ఈ సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో రైల్లో జరిగే సన్నీవేశాలు మాత్త్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయని దర్శక నిర్మాతలు చెప్పుకొచ్చారు. జగపతిబాబు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నరేష్, సత్య, అర్చనా సౌందర్య లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ టీజర్ ను చూస్తుంటే మహేష్ బాబు పేరును ఈ హీరో నిలబడతాడని సినీ వర్గాల్లో టాక్.. మరి మీరు కూడా ఆ టీజర్ ను ఒకసారి చూసేయండి..