ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరోలు తమ మార్కెట్ ను పెంచుకునే విధంగా నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వారు ఇతర భాషల్లో నటించడానికి కూడా ఏమాత్రం వెనకాడటం లేదు. పాన్ ఇండియా సినిమాలు జోరు పెరిగిపోవడంతో బాలీవుడ్ లో సినిమా చేసి వాటిని వివిధ రకాల భాషల్లో విడుదల చేయడానికి హీరోలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విధంగా ప్రభాస్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు ఇప్పుడు బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తూ అక్కడ కూడా తన మార్కెట్ ను పెంచుకునే విధంగా చేసుకుంటున్నారు. అయితే ఈ పద్ధతిని ఎప్పుడో అనుసరించిన రజినీకాంత్ ఒక అనుభవం దృష్ట్యా తమిళంలోనే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు.

1975లో అపూర్వ రాగంగల్ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యారు రజనీకాంత్. ఆ తర్వాత సంవత్సరం బాలచందర్ దర్శకత్వంలో అంతులేనికధ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అప్పటినుంచి ఆయన తమిళ సినిమాల్లో నటిస్తూనే క్రమం తప్పకుండా 1980 వరకు ప్రతి ఏటా తెలుగు సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ ఆ తర్వాత మూడేళ్ల పాటు ఆయన ఒక్క తెలుగు సినిమా కూడా చేయకుండా దూరంగా ఉండిపోయారు. మళ్లీ ఆ తర్వాత ఓ నాలుగైదు సినిమాల ద్వారా తెలుగు సినిమాల్లో కనిపించారు. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వలేదు.

దానికి కారణం లేకపోలేదట. పెదరాయుడు సినిమా లో కేవలం మోహన్ బాబు కోసం మాత్రమే పాపారాయుడు అనే పవర్ ఫుల్ గెస్ట్ రోల్ చేశారు కానీ వేరే సినిమాలోనూ ఆయన కనిపించలేదు. ఓ ఇంటర్వ్యూలో తాను ఉద్దేశ్యపూర్వకంగానే తెలుగు సినిమాలు తగ్గించుకున్నాను అని చెప్పారు. ఎందుకంటే నేను ఒక తెలుగు సినిమాలో నటిస్తే అదే సినిమాని తమిళంలోకి డబ్బింగ్ చేసి స్ట్రెయిట్ పిక్చర్ గా తమిళనాడులో విడుదల చేస్తున్నారు. ఇది ప్రేక్షకులను మోసం చేయడం లాంటిది. ఒక భాష నుంచి మరొక భాషలోకి చిత్రాన్ని డబ్ చేసినప్పుడు అది డబ్బింగ్ సినిమా అని ప్రేక్షకులకు తెలియజేయాలి. అలా కాకుండా స్ట్రెయిట్ పిక్చర్ రిలీజ్ చేస్తే  చిత్రంలో ఉన్న డబ్బింగ్ వాల్యూస్ తేలిపోయి సినిమా పై చెడు ప్రభావం ఎక్కువగా ఉండడంతో పాటు తన ఇమేజ్ కి భంగం ఏర్పడే ఆస్కారం ఉంది.   అందుకే తెలుగు సినిమాల్లో నటించకూడదని అనుకున్నాను అని రజనీకాంత్ తెలిపారు. అప్పుడు ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఆయన ను సూపర్ స్టార్ గా ఎదిగేలా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: