టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లక్ష్మీకళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు.  తొలి చిత్రంతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కాజల్ అగర్వాల్ మగధీర చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా అవతరించింది. అంతకుముందు చందమామ సినిమాతో హిట్ కొట్టిన ఆమెకు అంతగా పేరు రాలేదు కానీ మగధీర సినిమా తో యువరాణి మిత్రవింద దేవి కాస్త టాలీవుడ్ యువరాణిగా మారిపోయింది.

సినిమా తర్వాత ఆమె వరుస టాప్ హీరోల ఛాన్సులు అందుకున్నారు. 2004లో హిందీ చిత్ర సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కాజల్ 2021 వ సంవత్సరం వరకు అలుపెరగకుండా సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ ను అందుకున్నారు. తెలుగులో టాప్ హీరోయిన్ గా ఉన్న కాజల్ కు ఇతర భాషల నుంచి అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీ నుంచి ఆమెకు మంచి మంచి అవకాశాలు రాగా అక్కడ కూడా ఆమె హీరోయిన్ గా కొన్ని రోజులు ఉంది. ఆ తర్వాత హిందీ పరిశ్రమలో మంచి సినిమాల్లో నటించి క్రేజ్ ను దక్కించుకుంది. 

తొలి సినిమాతో ఆమె 24 లక్షల రెమ్యునరేషన్ ను తీసుకోగా చందమామ మూవీ కి దాదాపు అదే రెమ్యునరేషన్ తీసుకున్నారట కాజల్. అయితే ఎప్పుడైతే మగధీర మూవీ బ్లాక్ బస్టర్ ఆమె కోట్లల్లో పారితోషకాన్ని తీసుకోవడం మొదలు పెట్టారు.  తాజాగా మంచు విష్ణుతో ఆమె మోసగాళ్లు అనే సినిమా కి తన కెరీర్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుందట కాజల్. ఈ చిత్రంలో వీరిద్దరూ అక్కాతమ్ముళ్ల గా నటించగా ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించబడింది. ప్రస్తుతం కాజల్ ఆస్తులు 65 కోట్లు గా చెబుతున్నారు. ముంబైలో ఆమె దాదాపు ఆరు కోట్ల రూపాయల విలువైన మెరైన్ డ్రైవ్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటుంది. 3 విలాసవంతమైన కార్లు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: