టాలీవుడ్ లో ఎన్నో రకాల జోనర్ల సినిమాలు తెరకెక్కాయి. ప్రేమ కథ చిత్రాలు, యాక్షన్ చిత్రాలు, కామెడీ చిత్రాలు, హారర్ చిత్రాలు అన్ని రకాలు కూడా వేటికవే ప్రత్యేకంగా  తెరకెక్కి చాలా హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించాయి. అయితే ఆ మధ్య కొత్తగా ఫ్యాక్షన్ జోనర్ లో సినిమా అని ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. ఆ విధంగా ఆ జోనర్ లో అందరు హీరోలు సినిమాలు చేసి భారీ హిట్ సినిమాలను అందుకున్నారు. మరి ఈ జోనర్ లో వచ్చిన మొట్టమొదటి సినిమా ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ లో అప్పటి వరకు వచ్చిన జోనర్ లలోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను బోర్ కొట్టించే లా చేశాయి. దాంతో ఈసారి సరికొత్త సినిమా కావాలని ఫ్యాక్షన్ చిత్రాల వైపు మొగ్గు చూపారు మన దర్శక నిర్మాతలు. విభిన్నమైన కథాంశంతో వచ్చిన ఏ సినిమా అయినా చూడడానికి సిద్ధంగా ఉండే ప్రేక్షకులు ఉన్న టాలీవుడ్ లో ఫ్యాక్షన్ సినిమాలు రావడం తో కొత్తగా ఆనిపించడం తో వాటిని చేయడం ప్రారంభించారు హీరోలు. దాదాపు ఈ జోనర్ లో చేసిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. 

అలా ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ప్రేమించుకుందాంరా, సీతారామరాజు, సమరసింహా రెడ్డి, అనంతపురం, ఇంద్ర, ఆది, నరసింహ నాయుడు, చెన్నకేశవరెడ్డి, సీమసింహం, మిర్చి, అరవింద సమేత వీర రాఘవ లాంటి సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద హిట్టయ్యాయి. మరి ఈ ఫ్యాక్షన్ ట్రెండ్ ను మొదలు పెట్టిన హీరో ఎవరంటే వెంకటేష్. ఆయన కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం ప్రేమించుకుందాం రా,  సినిమా మామూలు ప్రేమ కథ కాగా, దానికి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ను జోడించి తెరకెక్కించి హిట్ చేశారు. ఈ సినిమా కి జయంత్ సి పరాంజీ దర్శకుడు కాగా అంజలా ఝవేరి హీరోయిన్ గా నటిచింది.. విలన్ గా జయప్రకాశ్ రెడ్డి చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: