ప్రస్తుతం
టాలీవుడ్ లో అందరు హీరోలు తమ సినిమాల జోరు చూపిస్తున్నారు. రెండేసి, మూడేసి సినిమాలను సెట్స్ మీదకు తీసుకు వెళ్తూ బిజీగా ఉన్నామని చాటి చెబుతున్నారు. ఒక
హీరో, ఇద్దరు హీరోలు పర్వాలేదు కానీ అందరు హీరోలు ఈ విధమైన ఈ రకంగా సినిమాలు
టాలీవుడ్ లో చేస్తూ సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు.
ఎన్టీఆర్ మూడు సినిమాలను ప్రకటించగా,
ప్రభాస్ నాలుగు సినిమాలు సెట్స్ మీద ఉంచాడు.
చిరంజీవి కూడా మూడు సినిమాలు,
బాలకృష్ణ కూడా దాదాపు అరడజను సినిమాలు సెట్స్ పైకి తీసుకు వెళుతున్నారని సమాచారం.
వీరే కాకుండా మరికొంత మంది హీరోలు కూడా ఇదే విధంగా సినిమాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ జాబితాలోకి చేరాడు నందమూరి
హీరో కళ్యాణ్ రామ్. ఆయన ప్రస్తుతం చేస్తున్న
సినిమా తో ఏకంగా నాలుగు సినిమాలను సెట్స్ పైకి తీసుకువచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ నాలుగు సినిమాలు అనౌన్స్ కాగా వీటిలో ఎంతో ఆసక్తికరమైన సినిమాలు కూడా ఉన్నాయి. నిన్నటి వరకు
కళ్యాణ్ రామ్ కెరియర్ అసలు ఉంటుందా ఊడుతుందా అన్నట్లు ఉండేది కానీ ఇప్పుడు నాలుగు సినిమాలు లైన్ లోకి వచ్చేసరికి
కళ్యాణ్ అభిమానులకు ఎక్కడలేని ఉత్సాహం నెలకొంది.
మైత్రి
మూవీ మేకర్స్ బ్యానర్ పై
కళ్యాణ్ రామ్ ఓ
సినిమా చేస్తుండగా ఆ తర్వాత చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న బింబి
సారా సినిమా విడుదల కానుంది. ఈ
సినిమా తర్వాత
కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న డెవిల్
సినిమా రానుంది. బ్రిటిష్ కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ
సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్
పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇవే కాకుండా ఒక కొత్త దర్శకుడినీ కూడా లైన్ లో పెట్టాడట
కళ్యాణ్ రామ్. మరి ఈ నాలుగు సినిమాలు నాలుగు జోనర్ల కు సంబంధించిన స్పెషల్ సినిమాలే. మరి ఈ సినిమాలతో వరుస ఫ్లాప్ లు అందుకుంటున్న
కళ్యాణ్ రామ్ కెరియర్ సెట్ అవుతుందో చూడాలి.