మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.  కమర్షియల్ సినిమాలకు మెసేజ్ ను జోడించి సూపర్ హిట్ సినిమాలను చేసే కొరటాల శివసినిమా ను అదేవిధంగా తెరకెక్కించి మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. వీరిద్దరి కలయికలో వస్తున్న తొలి సినిమా కావడంతో మెగా అభిమానులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. తన రీ ఎంట్రీలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చేసుకుంటూ పోతుండగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలలో ఈ సినిమా క్రేజీ సినిమా గా ఉందని చెప్పవచ్చు.

సినిమా తర్వాత తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు చిరంజీవి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది. ఇక ఈ సినిమాతో పాటే బాబి దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను కూడా ప్యార్ లల్ గా చేయనున్నాడట చిరంజీవి. చిరంజీవి ని గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ సినిమాలో చూడబోతున్నారు అంటున్నాడు దర్శకుడు బాబి.

ఇక తమిళ సూపర్ హిట్ చిత్రం వేదలం రీమేక్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఈ రెండు సినిమాల తరువాత చేయనున్నాడట. ఇకపోతే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ పాత్ర గురించి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ఆచార్య సినిమాను మలుపు తిప్పే పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా ఈ సినిమా ప్రారంభంలో ఈ పాత్రకు సంబంధించి చాలా తక్కువ నిడివి మాత్రమే  ఉండేదట. కానీ రామ్ చరణ్ ఈ పాత్ర చేయడానికి ఉత్సాహం చూపించడం తో కొరటాల శివ తండ్రికి సమానంగా ఈ పాత్రను పవర్ ఫుల్ గా తీర్చిదిద్దాడట.  చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా రామ్ చరణ్ కు పూజాహెగ్డే జోడీగా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: