సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే రజనీకాంత్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన హీరోగా నటించే సినిమాలకు భారీ క్రేజ్ తో పాటు అంచనాలు కూడా ఉంటాయి. సౌత్ లోనే నెంబర్ వన్ హీరోగా ఉన్న రజినీకాంత్ ఎంతో కష్టపడి పైకి వచ్చి ఇప్పుడు సూపర్ స్టార్ గా ఎదిగాడు. తొలుత ఆయన విలన్ పాత్రలు, సైడ్ హీరో పాత్రలు చేస్తూ రాగా కొన్ని మంచి సినిమాలతో గుర్తింపు దక్కించుకొని పూర్తిస్థాయి హీరోగా మారాడు. ఆ తర్వాత ఆయన సూపర్ స్టార్ అయ్యాడు. తమిళనాడులో ఆయన సినిమా వస్తుందంటే ఆరోజు ఎంతటి పెద్ద కంపెనీ అయినా సెలవు ప్రకటించాల్సిందే.

 ఇక రజనీకాంత్ తో నటించాలని ప్రతి ఒక్క హీరో, హీరోయిన్ అనుకుంటారు.  రజనీకాంత్ ప్రస్తుతం యాక్షన్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో ఆన్నాత్తే అనే సినిమాలో నటిస్తున్నాడు. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా తర్వాత ఆయన సినిమాలు చేయడు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఆయన సినిమాలు చేస్తాడో లేదో అన్న నిరాశ ఆయన అభిమానుల్లో నెలకొంది. ప్రస్తుతం కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్న రజనీకాంత్ తన తొలి సినిమాకి గాను వెయ్యి రూపాయల పారితోషికాన్ని మాత్రమే అందుకున్నారట.

అంతులేని కథ సినిమా లో ఈయన కె.బాలచందర్ దర్శకత్వంలో తాగుబోతు పాత్రలో నటించిన ఈ సినిమా కోసం వెయ్యి రూపాయల పారితోషికాన్ని రజినీకాంత్ అందుకోగా, కమలహాసన్ 1500 రూపాయల పారితోషికం తీసుకున్నారట. దక్షిణాదిన కాకుండా ఇతర దేశాల్లో సైతం కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న రజనీకాంత్ 70ఏళ్ల వయసులో కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు. మొదటి సినిమాతోనే తెలుగు వారికి పరిచయమైన రజనీకాంత్ వరుసగా తమిళంలో మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చి అక్కడ స్టార్ హీరోగా ఎదిగాడు కానీ ఆయన తమిళం మీద ఉన్న ఇష్టంతో తెలుగు సినిమాలను చేయడం తగ్గించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: