టాలీవుడ్ లో ఇప్పుడు సరికొత్త, గతంలో ఎప్పుడూ లేని పరిస్థితి నెలకొంది. ఇష్టం లేకుండా కూడా తమ సినిమాలను డిజిటల్ గా విడుదల చేస్తూ నిర్మాతలు గుడ్డిలో మెల్ల అన్నట్లు బతికి పోతున్నారు. ఈ విషయంలో దర్శకులు కూడా నిర్మాతలను ఏమీ అనలేక పోతున్నారు.
కరోనా నేపథ్యంలో థియేటర్లు ఇప్పటికీ తెరుచుకోకపోవడంతో
సినిమా థియేటర్లలో తమ సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. ఓవైపు వడ్డీ భారం పెరుగుతుండడం మరోవైపు సినిమాకు క్రేజ్ తగ్గిపోతుండడం తో డిజిటల్ రిలీజ్ చేయక తప్పట్లేదు.
ఇష్టం లేకున్నా కూడా తమ సినిమాలను డిజిటల్ లో రిలీజ్ చేయడం తమ సొంత బిడ్డ అమ్ముకున్నట్లే ఉంది అని సదరు నిర్మాతలు వెల్లడిస్తున్నారు. ఇటీవలే
సురేష్ బాబు కొత్త
సినిమా నారప్ప డిజిటల్ రిలీజ్ చేయడం పట్ల ఎంతో నిరాశగా ఉన్నట్లు వెల్లడించారు. తనకు ఈ సినిమాను డిజిటల్ గా రిలీజ్ చేయడం ఏ మాత్రం ఇష్టం లేదని తప్పక డిజిటల్ లో విడుదల చేయాల్సి వస్తుంది. లేదంటే తనకు ఎంతో ఇబ్బంది అవుతుంది అని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ
సినిమా దర్శకుడు
శ్రీకాంత్ అడ్డాల కూడా తను చాలా రోజుల తర్వాత డైరెక్ట్ చేసిన ఈ
సినిమా ఈ విధంగా డిజిటల్ గా విడుదల కావడంతో ఎంతో నిరాశ వ్యక్తపరుస్తున్నారు.
అంతేకాకుండా బొమ్మరిల్లు భాస్కర్ చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో చేస్తున్న
సినిమా మోస్ట్
వాంటెడ్ బ్యాచ్ లర్ కూడా ఓ టీ టీ లో విడుదల అవుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన కూడా ఈ విధంగా తన
సినిమా విడుదల అవుతుండడం ఎంతో నిరాశపరుస్తుంది అని తన సన్నిహితుల వద్ద వెల్లడిస్తున్నారట. దీంతో ఈ ఇద్దరు దర్శకులు కం బ్యాక్ చేయాలనుకున్న చిత్రాలు ఇలా అయిపోవడంతో కక్కలేక మింగలేక పోతున్నారట. నిర్మాతను దృష్టిలో పెట్టుకుంటే ఈ సినిమాను ఓ టీ టీ లో విడుదల చేయడమే మంచిదని ఓవైపు అనిపిస్తున్న ఇంకోవైపు థియేటర్లలో విడుదల అయితే బాగుండేది అని అనిపిస్తుందట.