
దర్శకధీరుడు రాజమౌళి టాలీవుడ్ లో ఎన్నో గొప్ప పేరు ప్రఖ్యాతలతో మంచి పేరు తో వరుస సినిమా లతో దూసుకు పోతున్నారు. తెలుగులో నెంబర్ వన్ డైరెక్టర్ గా ప్రస్తుతం రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకోగా తెలుగు సినిమానీ దేశమంతా గర్వించదగ్గ స్థానానికి తీసుకు వచ్చాడు. బాహుబలి సినిమా తో ఒక్క సారిగా తన రేంజ్ ను టాలీవుడ్ రేంజ్ కూడా పెంచాడు. ఇది కేవలం ఒక రాజమౌళి వల్లనే జరిగిందని చెప్పొచ్చు. సినిమాలు ఎవరైనా తీస్తారు, ప్రజలకు నచ్చే విధంగా కూడా ఎవరైనాసినిమాలు తీస్తారు కానీ ట్రెండ్ సెట్ చేసే విధంగా సినిమాలు తీయడమే రాజమౌళి స్పెషాలిటీ.
అలాంటి రాజమౌళి అపజయం ఎరుగని దర్శకుడు గా ఇండస్ట్రీలో కొనసాగుతూ తన ప్రతి సినిమాని శిల్పంలా చెక్కుతాడు. అందుకే ఆయనకు జక్కన్న అనే పేరు వచ్చింది. పర్ ఫెక్షన్ కోసం రోజుల తరబడి షూటింగ్ లు చేసి టైం తీసుకున్న కూడా భారీ హిట్ ను మాత్రం అందుకుంటాడు. రాజమౌళి లోని డెడికేషన్ ను మరో డైరెక్టర్ లో మనం చూడలేదు అని ఆయన చేసే సినిమాలను బట్టి అర్థమవుతుంది. కథ విషయంలో ఎంతో గొప్పగా ఉండాలి అన్న దాని కంటే దాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయాలనేది రాజమౌళి ఆలోచించే విధానం. అందుకే సినిమా మొత్తం మీద నాలుగైదు తిరుగులేని సీన్ లను భారీగా ప్లాన్ చేసుకొని వాటితోనే మాయ చేసి హిట్ కొట్టి ప్రేక్షకులను మెప్పిస్తాడు.
ఇక రాజమౌళి ఈ మధ్య కాలంలో తన ఫేవరెట్ హీరో ఎవరు అంటే ఎన్టీఆర్ పేరు చెప్పాడట. ఆయన డ్యాన్స్ యాక్టింగ్ చూసి జక్కన్న ఫిదా అవడం వల్ల ఎన్టీఆర్ కు వీరాభిమాని అని చెప్పుకొచ్చాడు. తారక్ అంటే చాలా ప్రత్యేక అభిమానం చూపించే రాజమౌళి అభిమాని లాగే ఆయన తో సినిమాలు చేసి ఇద్దరికీ హిట్ లను అందించాడు. స్టూడెంట్ నెంబర్ వన్, యమదొంగ, సింహాద్రి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్టీఆర్ తో చేసి టాలీవుడ్ లో ఎక్కువగా ఎన్టీఆర్ తో సినిమా లు చేసి ఆయన అభిమాని చూపించుకున్నాడు. మరి వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.