పీపుల్ స్టార్
ఆర్ నారాయణ మూర్తి గురించి తెలియని వారు ఉండరు. ఆయన సినిమాలలో సామాజిక కోణం ఆలోచించే దృక్పథం మెండుగా ఉంటాయి.
నారాయణ మూర్తి అంటే ప్రతి ఒక్కరికి ఎంతో గౌరవం ఉంటుంది. ప్రత్యేకమైన అభిమానం కూడా ఉంటుంది. ఎర్రన్న అంటూ ఎంతో ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు
ఇండస్ట్రీ జనాలు. ఆయన ఎక్కడ కనిపించినా కూడా సీఎం అయినా సరే ముందుగా వచ్చి నారాయణమూర్తిని పలకరిస్తుంటారు. ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా బస్సులో ప్రయాణిస్తూ
నారాయణ మూర్తి ఎంతో సింప్లిసిటీ నీ ప్రదర్శిస్తూ ఉంటారు.
డబ్బుకు ఆశపడి కమర్షియల్ చిత్రాల జోలికి వెళ్లనని చెప్పి తనకు నచ్చిన ప్రజలు మెచ్చిన సినిమాలను వారికి ఉపయోగపడే సినిమాలను మాత్రమే చేస్తూ ఇప్పటికీ అదే తరహా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ప్రజా సమస్యలు ఏవైనా తనదైన శైలిలో స్పందిస్తూ వారికి సమాధానం వచ్చేలా చేస్తూ ఉంటారు. ఇంతవరకు ఆయన
పెళ్లి చేసుకోలేదన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే దీని వెనక ఆయనకు ఓ ఎమోషనల్
లవ్ స్టోరీ ఉందట. ఈ కారణంగానే
నారాయణమూర్తి పెళ్లి చేసుకోలేదని అంటున్నారు.
ఈ జనరేషన్ లో కూడా ఆయనకు ఎంతో మంచి గౌరవం ఉందంటే
నారాయణమూర్తి తన వ్యక్తిత్వాన్ని ఎంత పెంపొందించుకున్నారు అర్థం చేసుకోవచ్చు.
స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై దర్శకుడిగా నటుడిగా నిర్మాతగా సినిమాలు చేస్తూ సమాజంలోని సమస్యలను వేలెత్తి చూపుతూ లెఫ్ట్ సినిమాలను ఎక్కువగా తెరకెక్కిస్తు ఉంటారు.
సినిమా ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా
నారాయణమూర్తి సినిమాల్లో మాత్రం పెద్దగా మార్పులు రావు. సిద్ధాంతాలకు కట్టుబడి ఓ ప్రజా కళాకారుడుగా బాధ్యతగా సినిమాలు చేస్తూ ఉంటారు. ఆర్.నారాయణమూర్తి జీవితంలో
పెళ్లి లేదు అనుకున్న సమయంలో
డిగ్రీ లో ఒక అమ్మాయిని ఎంతగానో ఇష్టపడ్డారు. ఆమెతో ప్రేమను కొనసాగించిన అనంతరం
పెళ్లి కోసం
అమ్మాయి ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళిన
నారాయణ మూర్తి ఆ
అమ్మాయి గొప్పింటి
అమ్మాయి అని తెలియడంతో నిర్ణయం మార్చుకున్నారు. తాను సినిమాలు అనుకుంటూ వెళితే జీవితం ఎలా ఉంటుందో తెలియదు నేను చెట్టు కింద అయినా సరే ఉంటాను కానీ తెలిసి తెలిసి ఆ
అమ్మాయి జీవితాన్ని కష్టాల్లోకి నెట్టలేను అని చెప్పి
పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడట.