మలయాళీ ముద్దుగుమ్మ అమలాపాల్ అంటే తెలియని ప్రేక్షకుడు ఉండడేమో. తమిళ సినిమాల ద్వారా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన అమలా ఆ తరువాత దక్షిణాదిన అన్ని భాషలలో నటించింది. ఈమె సినిమాల విషయం పక్కన పెడితే వ్యక్తిగత జీవితం అంతా సాఫీగా లేదు. 2014వ సంవత్సరంలో డైరెక్టర్ ఏఎల్ విజయ్ ను ప్రేమించి పెళ్లాడగా 2017 లో మనస్పర్థల కారణంగా విడిపోయి వారు చివరకు విడాకులు తీసుకుని ఎవరి జీవితాలను వారు బ్రతుకుతున్నారు.

విడాకుల తర్వాత ఆమె ఎవరితో ప్రేమలో పడినట్లు కనిపించడం లేదు. తన అందచందాలతో అలరించిన అమల బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. 1991 అక్టోబర్ 26న సాధారణ కుటుంబంలో పుట్టింది అమలాపాల్. బంధుమిత్రులలో ఆమెకు గాయని గా మంచి పేరు ఉండడంతో కొన్ని ఫంక్షన్స్ లో పాటలు పాడి వారిని ఎంతగానో ఆనందింపజేసేది. అలా ఆమె స్టేజి మీద పాటలు పాడి కొంత గుర్తింపు తెచ్చుకుంది. తండ్రికి ఎనలేని విశ్వాసం కూతురు పై ఉండేది. ఆమె ఏ పని చేసినా ఆత్మవిశ్వాసంతో చేస్తుంది అని ఆయన నమ్మేవాడు. ఇండియాలో అమలపాల్ తల్లి, విదేశాల్లో షూటింగ్ లకి మాత్రం ఆమె తండ్రి వచ్చేవారట.

ఆన్నయ్య అభిజిత్ సహాయ సహకారాలు ఆమె నటి కావడానికి ఎంతో దోహదపడ్డాయి అని ఆమె చెబుతుండేది. అమెరికాలో మర్చంట్ నేవీ లో పని చేసేటప్పుడు ఎప్పుడు ఇంటికి వచ్చిన అమ్మానాన్న చెల్లి కోసం గిఫ్ట్ లు తీసుకొచ్చేవాడు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం ఈ అన్నా చెల్లెళ్ళకు. నిజానికి వాళ్ళ కుటుంబంలో ఎవరు సినీ పరిశ్రమలో లేకపోయినా నటనా శక్తి స్వతహాగా అలవడింది అమలా కి.  హీరోయిన్లలో తను అందంగా ఉండాలని  అద్దం ముందు నిల్చొని తన అందాన్ని చూసుకొని మురిసిపోయేది అమల. కాలేజీ డేస్ లో ఓ సారి వాళ్ల కాలేజీకి మలయాళ దర్శకుడు రావడంతో ఆమె అందాన్ని చూసి ముగ్ధుడై సినిమాలో నటిస్తావా అని అడిగారు. అలా ఆమె నీలి తామర సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: