సౌత్ ఇండియా లోనే భారీ క్రేజ్ ఉన్న హీరోయిన్ నయనతార. తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో ఈమెకు ఉన్న క్రేజ్ ఏ హీరోయిన్ కి లేదనే చెప్పాలి. 35 సంవత్సరాలు దాటినా కూడా 20 ఏళ్ల అమ్మాయి లాగే కనిపిస్తూ ప్రేక్షకులకు సెగలు రేపుతుంది నయనతార. తన సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇక ప్రియుడితో కలిసి ఆమె చేసే సోషల్ మీడియాలో పోస్ట్ గా చేసి ప్రేక్షకులను ఇంకా ఉడికిస్తుంది. పెద్ద పెద్ద హీరోలు సైతం ఆమె కోసం ఆమె డేట్ల కోసం ఆమె అంగీకారం కోసం ఎదురు చూస్తారు అంటే నయనతారకు ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక మొదటి నుంచి నయనతార పై ఉన్న ఒకే ఒక కంప్లైంటు ఆమె సినిమా ప్రమోషన్స్ కు హాజరు కాకపోవడం. ముఖ్యంగా తెలుగు సినిమాల విషయంలో ఆమె చాలా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తూ ఉంటుంది. ఏ సినిమాకైనా హీరో హీరోయిన్లు ప్రమోషన్ లో పాల్గొనాలి కానీ నయనతార మాత్రం ఎలాంటి ప్రమోషన్ లలో పాల్గొనదు. అది అగ్రిమెంట్లో క్లియర్ గా మెన్షన్ చేస్తుంది కూడా. చాలా సార్లు ఆమెతో పనిచేసిన నిర్మాతలు ఆమె పై ఇలాంటి కంప్లైంట్ ఇవ్వగా అగ్రిమెంట్ లో ఉన్న దాన్ని చూపి నయనతార ఈజీగా ఎస్కేప్ అయ్యేది. 

ప్రమోషన్ లో పాల్గొంటే ఏమవుతుందో ఏమో తెలియదు కానీ నయనతార మాత్రం సినిమా షూటింగ్ వరకే పరిమితమై ఆ తర్వాత కంటికి కనబడకుండా పోతుంది. ఇకపోతే ఆమె తన ప్రియుడు విగ్నేష్ సినిమా చేస్తే మాత్రం అన్ని దగ్గరుండి చూసుకుంటుంది. సినిమా షూటింగ్ దగ్గర నుంచి ప్రమోషన్ వరకు ముందుండి నడిపిస్తుంది. అలాంటి ఆసక్తి ఇంట్రెస్ట్ ఇతర సినిమాల పై ఎందుకు ఉండదని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం గా అగ్రిమెంట్లో ఎలా ఉంటే నేను అలానే వ్యవహరిస్తాను. దానికి మాత్రమే ఒప్పుకుంటాను అని చెప్పి వారి నోళ్ళు ముయిస్తుంది. నయనతార ఏం చెప్పినా నడుస్తుంది అంటే ప్రజల్లో ఆమెకు ఉండే క్రేజ్ వేరే అని అర్థం చేసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: