ఎన్టీఆర్ బుల్లితెరా రంగంలో అడుగుపెట్టి తనదైన స్థాయిలో దూసుకుపోతున్నారు.ఎన్టీఆర్ తనకంటూ ఒక ఇమేజ్ టెలివిజన్ సృష్టించుకున్నారు. నటనలో గాని డైలాగ్ డెలివరీ లో గాని ఎన్టీఆర్ ప్రాణం పెట్టి చేస్తాడు అని ఇండస్ట్రీలో మంచి టాక్ ఉంది. ఎటువంటి డైలాగ్ అయిన సింగిల్ టేక్ లో చెప్పగల సత్తా ఇండస్ట్రీ లో ఇప్పుడున్న స్టార్ హీరోలలో ఎన్టీఆర్ తప్ప ఎవ్వరికి సాధ్యం కాదని అందరికి తెలుసు. ఎలాంటి పాత్రలో అయిన పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు తన సూపర్ నటనతో మంచి గుర్తింపు తెచ్చిపెడతాడు. రాజమౌళి పుణ్యమా అని ఎన్టీఆర్ మరియు రాంచరణ్ వేరే సినిమాలకు దూరమయ్యారు. వారిద్దరూ బిగ్ స్క్రీన్ పై కనిపించి సుమారు 3 సంవత్సరాలు అయింది. ఈ గ్యాప్ లో రాంచరణ్ ఆచార్య సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించాడు. కానీ ఎన్టీఆర్ ఎటువంటి సినిమాలో నటించలేదు. మూడు సంవత్సరాలుగా ఆయన అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు

. వారిలో నిరాశ నిస్పృహలు తొలగించడానికి వారందరిని తిరిగి అలరించడానికి మళ్ళీ ముందుకు వచ్చారు ఎన్టీఆర్. బుల్లితెర రంగంలో మొదట బిగ్ బాస్ షో తో మొదలు పెట్టి తనదైన టాలెంట్ తో ఆ షో మంచి విజయం సాధించేలా చేసారు. అదే ఉత్సాహంతో ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు అంటూ జెమినీ టీవీ తరపున ఒక షో చేసాడు. ఈ షో కర్టన్ రైజర్ నేడు ప్రసారమైంది. ఈ షో కు గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రాంచరణ్ రావడంతో ఈ షోకు మరింత ఆకర్షణ వచ్చిందని సమాచారం. ఎన్టీఆర్ రాంచరణ్ లు కలిసి ఒకే షో లో కనిపించడంతో వారి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న rrr చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని తెగ వెయిట్ చేస్తున్న వీరి అభిమానులకు ఈ షో కొంత ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ షో లో రాంచరణ్ తన వ్యక్తిగత విషయాలు ఎన్నో పంచుకున్నాడని సమాచారం. అంతే కాదు ఈ షో లో గెలిచినా తన తండ్రి స్థాపించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కు డొనేట్ చేస్తాను అని చెప్పాడని సమాచారం. అంతే కాకుండా ఎన్టీఆర్ కోసం ఆరంజ్ చిత్రంలో సిడ్ని నగరమే చేసే నేరమే అంటూ మంచి పాట పాడి ప్రేక్షకులను బాగా అలరించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: