

అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలో కథలు పూర్తి చేసి వారిద్దరికీ వినిపించి గ్రీన్ సిగ్నల్ కూడా అందుకోనున్నారట మెహర్ రమేష్. కాగా తన కెరీర్లో వరుసగా ఫ్లాప్స్ ఇచ్చిన మెహర్ రమేష్ మెగాస్టార్, పవర్ స్టార్, సూపర్ స్టార్ లతో ఎటువంటి రిజల్ట్ ని ఇచ్చే సినిమాలు తీస్తారో అని ఆయా హీరోల ఫ్యాన్స్ లో ఇప్పటి నుండే కొంత భయం నెలకొన్నట్లు టాక్. అయితే మెహర్ రమేష్ తన తో చేస్తున్న సినిమా ద్వారా సూపర్ హిట్ కొట్టడం, మళ్ళి మంచి ఫామ్ లోకి రావడం ఖాయం అని, తనలోని పట్టుదల నాకు తెలుసు అంటూ ఇటీవల ఒక సందర్భంలో మెగాస్టార్ చెప్పడం జరిగింది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ లో ఎంతవరకు వాస్తవం ఉందొ, నిజంగానే మహేష్, పవన్ లతో మెహర్ సినిమాలు చేస్తారో లేదో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.