తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోయిన్ భానుప్రియ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. భానుప్రియ సితార సినిమాతో చిత్ర పరిశ్రమకి పరిచయమైంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తరువాత ఈమెకు సినీ ఇండస్ట్రీలో గట్టిపోటీనే ఎదుర్కొంది. అయితే ఆమె చూడడానికి చాలా అందంగా.. పెద్ద పెద్ద కళ్ళతో అందర్నీ ఇట్టే ఆకట్టుకునేది ఈ తార. అంతేకాక.. భానుప్రియ కళ్ళతోనే హావభావాలను పలికించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన నటిగా గుర్తింపు సంపాదించుకుంది.

అయితే భానుప్రియ హీరోయిన్ గా తన జీవితాన్ని స్టార్ట్ చేసిన మొదట్లో విజయశాంతి, రాధ, సుహాసిని వంటి హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. ఇక విజయశాంతి, రాధ ఇద్దరూ కూడా గ్లామర్ పరంగాను డాన్సుల పరంగాను తిరుగులేని క్రేజ్ ను తెచ్చుకున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ల ధాటిని తట్టుకుని, భానుప్రియ నిలబడటానికి కారణం ఆమెకి క్లాసికల్ డాన్స్ లో మంచి ప్రవేశం ఉండటమనే చెప్పాలి మరి. అయితే ఈ కారణంగానే ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో మాట్లాడారు.

కాగా.. ఈ సందర్భంగా పరుచూరి మాట్లాడుతూ.. విజయశాంతి, రాధ వంటి స్టార్ హీరోయిన్స్ తో డాన్స్ చేసేటప్పుడు వారికి తగ్గట్టుగా పోటీగా చిరంజీవి డాన్స్ చేసే వారు కానీ 'భానుప్రియతో డాన్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చిరంజీవిగారే అంటూ ఉండేవారని అన్నారు. ఇక భానుప్రియా మంచి డాన్సర్ అని ఆయన నమ్మేవారంట. అయితే స్టేట్ రౌడీ' సినిమా చూస్తే ఈ విషయం మీకు తెలిసిపోతుంది.. నాట్యమయూరి అని కూడా అప్పట్లో పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా బిరుదు కూడా అందుకుంది. ఇక తన నటనతో , డాన్స్ తో అందరిని ఆకర్షింపచేసేది భానుప్రియ అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: