ఒకప్పుడు రీమేక్ సినిమాలు చేయాలంటే హీరోలు ఎంతో భయపడేవారు. ఎందుకంటే రీమేక్ సినిమాలు చేస్తే వచ్చే విజయం కంటే విమర్శలకు ఎక్కువగా భయపడే వారు. కానీ ఆ తర్వాత కాలంలో ఎక్కువ సినిమాలు చేయడం మొదలు పెట్టారు మన హీరోలు. గతంలో ఏ హీరో అయినా రీమేక్ చేస్తే ఇందులో మీరు చేసిన కొత్త ఏమున్నది.. ఆల్రెడీ ఉన్న కథని. చేసిన సినిమా నీ మీరు చేశారు.. దాంట్లో గొప్పేంటి అని విమర్శలు ఎదుర్కొనేవారు.  దానికి తోడు కొన్ని సినిమాలు రీమేక్ చేసినా అవి ఏ భాష నుంచి చేశారు అనేది ఎవరికీ తెలియదు. దాంతో సదరు సినిమా రీమేక్ అని ఎక్కువ మందికి తెలిసి ఆస్కారం ఉండదు.

 కానీ సోషల్ మీడియా రోజులలో ఒక సినిమా కాదు కదా ఒక్క సీన్ కూడా సమ్ ఉన్నా ఇట్టే తెలిసిపోతుంది. దాంతో అఫీషియల్ గా సదరు సినిమాను రీమేక్ చేస్తున్నామని చెప్పక తప్పట్లేదు.  అయితే గతంలో కంటే ఎక్కువగా హీరోలు రీమేక్ సినిమాల పై మోజు పడుతున్న కూడా వారిపై విమర్శలు వస్తున్నా కూడా రీమేక్ సినిమాలను వదలడం లేదు.  ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో సహా చాలా మంది హీరోలు రీమేక్ లను ఎక్కువగా ఇష్టపడటం వెనుక కారణం ఉందట.

అదేమిటంటే కథల కొరత. తెలుగులో ఈ కథల కొరత కొంత వరకు తక్కువగానే ఉన్నా ఇతర భాషలలో మాత్రం ఈ కథల కొరత విరివిగా ఉన్నట్లుగా మన తెలుగు నుంచి రీమేక్ అయ్యే సినిమా ల వరుస ను బట్టి చెప్పవచ్చు. అయితే ఇటీవల కాలంలో తెలుగులో కూడా కథల కొరత గా ఉన్నట్లు రీమేక్ అయ్యే సినిమాలను బట్టి చెప్పవచ్చు. మరి ఒకప్పుడు ఎదుర్కొన్న విమర్శలను ఒకప్పుడు చేసిన రీమేక్ సినిమాల కంటే ఎక్కువగా ఇప్పుడు చేస్తూ ఉండడం టాలీవుడ్ ను ఎక్కడ దాకా తీసుకు వెళుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: