ఇటీవల కాలంలో టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాలు తెరకెక్కడం రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఈ మధ్యనే దగ్గుబాటి వారి హీరోలు వెంకటేష్ మరియు రానాల మధ్య ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కుతుంది. నెట్ ఫ్లిక్స్  సంస్థ కోసం ఈ భారీ మల్టీ స్టారర్ ఉండగా తాజాగా తెరపైకి మరో మల్టీ స్టారర్ రాబోతుంది. అదే ఇద్దరు మెగా హీరోలు కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయాలనే వాదన. వారవరో కాదు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మరియు వైష్ణవ్ తేజ్.

ఇటీవలే ఉప్పెన సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని రెండో సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు వైష్ణవ్ తేజ్.  మరోవైపు సాయి ధరమ్ తేజ్ కూడా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్స్ అందుకొని క్రేజీ హీరో గా ఉన్నాడు. ఇప్పుడు వీరిద్దరూ బ్రదర్స్ కలిసి ఓ సినిమాలో నటిస్తే చూడాలనేది మెగా అభిమానుల కోరిక. కొండపొలం సినిమా ను త్వరలోనే విడుదలకు సిద్ధ చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్.  అలాగే సాయి తేజ్ కూడా ఇటీవలే రిపబ్లిక్ విడుదల చేసి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య మల్టీస్టారర్ సినిమాను ఎప్పుడు ఎవరు ఎలా చేస్తారో చూడాలి. బైక్ యాక్సిడెంట్ కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు సాయి తేజ్. అయితే కోలుకున్న తర్వాత కార్తీక్ అనే నూతన దర్శకుడు సినిమా ను మొదలు పెట్టనున్నారు తేజ్. అటు వైష్ణవ్ కూడా తన మూడో చిత్రాన్ని ఇప్పటికే మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలు పూర్తయిన తర్వాత ఎవరైనా దర్శకుడు వీరితో కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తే బాగుంటుందని వారి వారి అభిమానులు కోరుకుంటున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు ఎవరైనా దర్శకుడు వీరిద్దరి కోసం ఓ మంచి కథ రాసి వారిని ఒప్పించి సినిమా చేస్తాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: