ఇక ఈ కార్యక్రమంలో కూడా తన అదిరిపోయే పంచులతో ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి. ఇకపోతే హైపర్ ఆది కామెడీ అద్భుతంగా చేస్తాడు కానీ డాన్స్ మాత్రం అస్సలు టచ్ లేదు అన్న విషయం దాదాపుగా అందరికీ తెలుసు. కొన్ని కొన్ని సార్లు స్టేజిమీద చిత్రవిచిత్రంగా డ్యాన్సులు చేసి ఎన్నోసార్లు అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా డాన్స్ అంటే టచ్ లేని హైపర్ ఆది అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసి అదిరిపోయే స్టెప్పులు వేస్తే ఇక బుల్లితెర ప్రేక్షకులు అందరూ కూడా ఆశ్చర్య పోతారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు తన అభిమానులందరినీ ఇలాంటి ఆశ్చర్యంలో ముంచెత్తాడు హైపర్ ఆది.
డాన్స్ రియాలిటీ షో డీ లో అప్పుడప్పుడు చిత్రవిచిత్రమైన డాన్సులు చేయడం చూశాము కానీ ఇటీవల మాత్రం ఎంతో ప్రొఫెషనల్గా డాన్స్ చేశాడు హైపర్ ఆది. మెగాస్టార్ చిరంజీవి అందరివాడు సినిమా లోని వీరాది వీరుడా అంటూ సాగిపోయే పాటపై ఏకంగా లుంగీ కట్టుకుని స్టేజి మీదికి వచ్చిన హైపర్ ఆది డాన్స్ తో ఆకట్టుకున్నాడు అనే చెప్పాలి. అదిరిపోయే స్టెప్పులు వేసి ఇరగదీసాడు. ఇక హైపర్ ఆది డాన్స్ కి అటు జడ్జీలు కూడా ఫిదా అయిపోయారు. అయితే ఇప్పుడు వరకు అసలు డాన్స్ టచ్ లేని హైపర్ ఆది ఇక ఒక్కసారిగా అదిరిపోయే పర్ఫామెన్స్ చేయడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి