సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన ప్రధాన చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను నిరాశ పరచడంతో ఆయన సినిమాలు ఎందుకు హిట్ అవ్వడం లేదు అన్న వాదన ఇప్పుడు ఇండస్ట్రీలో పెరిగిపోయింది. ముఖ్యంగా తమిళనాట ఆయనకు సంబంధించిన సినిమాల విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోవడం లేదు అనే ఓ రకమైన చర్చ నడుస్తుంది.  చూస్తుంటే ఆయన గత కొన్ని రోజులుగా పలు సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయన ఎంపిక చేసుకునే సినిమాల విషయంలో చాలా లోపాలు కనిపిస్తున్నాయి.

ఆయన మెల్లమెల్లగా ఫేడ్ అవుట్ అయి పోయే విధంగా ఆయన చేసే సినిమా లు ఉండటం వల్ల ఇప్పుడు ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయనే ధ్యాస అందరికీ వస్తుంది. ఇంతకు ముందు రజనీకాంత్ ఏ సినిమా లో నటించిన సూపర్ హిట్ అయ్యేది కానీ ఇప్పుడు గత నాలుగు సినిమా లు గా ఆయన చేసే సినిమా ప్రతిదీ ఫ్లాప్ అవతున్నాయి.  వాస్తవానికి ఆయన కరోనా ముందు పెద్దన్న సినిమాను మొదలు పెట్టగా అతి కష్టం మీద దాన్ని పూర్తి చేశాడు. కరోనా తర్వాత ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఆయన ఒప్పుకోలేదు.

 దాంతో ఆయన భవిష్యత్తులో సినిమాలు చేస్తాడా లేదా అన్న అనుమానాలను ఇప్పుడు వ్యక్తపరుస్తున్నారు. గత కొన్ని నెలల్లో ఆయన ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరొక సినిమా ను ప్రకటించే వాడు. కానీ ఇప్పుడు పెద్దన్న సినిమా విడుదలై చాలా రోజులు అవుతున్నా కూడా ఆయన తదుపరి సినిమా ఏంటి అనేది ఇప్పటి వరకు తెలియలేదు. కార్తీక్ సుబ్బరాజు  దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని గతంలో వార్తలు వినిపించిన ఇప్పుడు అది కార్యరూపం దాల్చడం చాలా కష్టమని తెలుస్తోంది. మరి రజినీ తన అభిమానులను ఖుషీ చేసేలా సినిమాలు చేస్తాడా లేదా పెద్దన్న తోనే సరిపెడతాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: