టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తెలుగు సినిమా రంగంలో రెండు దశాబ్దాలుగా నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినిమా ల్లోకి వ‌చ్చిన‌ మహేష్ బాబు ఇప్పుడు సౌతిండియాలోని టాప్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల్లో ఒకరిగా ఉన్నారు. మహేష్ బాబు ను తెలుగు ప్రేక్షకులను గుండెల్లో పెట్టుకుని మ‌రీ చూసుకుంటున్నారు. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ ని ఏడు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆదరిస్తున్నారు అంటే కచ్చితంగా ఆ కుటుంబం తెలుగు ప్రేక్షకులకు ఎంతో రుణపడి ఉందని చెప్పాలి. మరి ఆ కుటుంబం తెలుగు ప్రేక్షకులకు ఏం చేసింది ?  తెలుగు జ‌నాలు , తెలుగ ప్రేక్ష‌కులు కష్టాల్లో ఉన్నప్పుడు ఏమైనా సాయం ఉందా అంటే నో అని చెప్పాలి.

సూపర్ స్టార్ కృష్ణ మాత్రం ఆయన టాప్ హీరోగా కొనసాగుతున్న టైంలో  సమైక్య రాష్ట్రంలో వరదలు , విపత్తులు వచ్చినప్పుడు తనవంతుగా సాయం చేయడంతో పాటు విరాళాలు సేకరించి ప్రజలను ఆదుకోవాలని తన అభిమానులకు పిలుపు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఆయన వారసుడు మహేష్ బాబు మాత్రం ఆ విషయంలో అలసత్వంతో ఉంటున్నారు. శ్రీమంతుడు సినిమా వచ్చినప్పుడు మాత్రం గుంటూరు జిల్లా తెనాలిలో తమ స్వగ్రామం బుర్రి పాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని కొంతవరకు అభివృద్ధి చేశారు.

ఆ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ విపత్తులతో విలవిలలాడుతోంది. సీమ‌తో పాటు చిత్తూరు జిల్లా ను వ‌ద‌ర‌లు ఊపేస్తున్నాయి. పైగా తన బావ గల్లా జయదేవ్ కూడా సీమ‌ ప్రాంతానికి చెందిన వారే.

అయినా మహేష్ మాత్రం అటు వైపు కన్నెత్తి చూడడం లేదు సరికదా వాళ్లకు సహాయం చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు లేదు. ఇప్పటికైనా స్పందించి కష్టాల్లో ఉన్న సీమ‌ను త‌న వంతుగా ఆదుకుంటారని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: