టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం 'దృశ్యం 2'. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సినిమాని తెరకెక్కించారు. దృశ్యం సినిమాకి సీక్వెల్ గా దృశ్యం 2 రూపొందడం జరిగింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఓటీటీ వేదికగా అమెజాన్ ప్రైమ్ లో గురువారం ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తున్నా.. ఈ సినిమాపై మలయాళ వెర్షన్ ఎఫెక్ట్ పడిందని అంటున్నారు. అది ఎలాగంటే ఇప్పటికే దృశ్యం 2  మలయాళ వెర్షన్లో మోహన్ లాల్ నటించారు. ఈ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. అప్పుడు మలయాళ వెర్షన్ సూపర్ డూపర్ హిట్ అయింది.

 అయితే అమెజాన్ ప్రైమ్ లోనే విడుదలైన మలయాళ వెర్షన్ సూపర్ హిట్ అవ్వడంతో తాజాగా తెలుగు వర్షన్ ని రీమేక్ చేసి మళ్లీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసినా ఆల్రెడీ మలయాళ వెర్షన్ ని తెలుగు ప్రేక్షకులు చూడడంతో ఆ ఎఫెక్ట్ అనేది వెంకటేష్ దృశ్యం 2  సినిమాపై పడింది. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి దృశ్యం సినిమాకి పర్ఫెక్ట్ సీక్వెల్గా దృశ్యం2 అదిరిపోయిందని అంటున్నారు. మరోవైపు రివ్యూలు కూడా ఈ సినిమాకి అన్ని పాజిటివ్ గానే వస్తున్నాయి. అయితే దృశ్యం సినిమా పై ఉన్న ఆసక్తితో ఆల్రెడీ తెలుగు ఆడియన్స్ మలయాళంలో దృశ్యం సినిమాను చూసేయడంతో అది కాస్త వెంకటేష్ దృశ్యం2 కి పెద్ద దెబ్బ అని చెప్పాలి.

 ఈ మధ్యకాలంలో సినిమా బాగుందని వార్తలు వినిపిస్తే చాలు.. ఏ భాష సినిమా అయినా తెలుగు ప్రేక్షకులు చూసేస్తున్నారు.అలాగే దృశ్యం సినిమాకి సీక్వెల్ అంటే మొదటి భాగం పై ఉన్న ఇంపాక్ట్ తో మొదట విడుదలైన మలయాళ వెర్షన్ ని ఎక్కువ మంది చూశారు. దీంతో ఆ ప్రభావం కాస్త ఈ సినిమాపై పడింది ఒకవేళ మలయాళ వెర్షన్ ని విడుదల చేయకుండా తెలుగు వెర్షన్ ముందుగా విడుదల చేసి ఉంటే ఈ సినిమా రెస్పాన్స్ ఇంకోలా ఉండేది. ఇక ఇప్పటికే వెంకటేష్ నారప్ప సినిమా తో మంచి విజయాన్ని అందుకోగా దృశ్యం 2 తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: