తాజాగా లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగ శౌర్య నటించిన లేటెస్ట్ సినిమా లక్ష్య.. ఈ సినిమాపై ఇక్కడ ప్రేక్షకులు అక్కడ సినీ సెలబ్రిటీలు కూడా భారీగా అంచనాలను పెట్టుకున్నారు. కానీ విడుదలైన తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం కూడా అందుకో లేకపోవడం ఆలోచించ దగ్గ విషయం.. ఇకపోతే ఈ సినిమాకు సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే కానీ ఈయన అంతకుముందే సుమంత్ తో కలిసి సుబ్రమణ్యపురం అనే సినిమాను తెరకెక్కించారు. కానీ ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.

డిసెంబర్ 10వ తేదీన ఎన్నో అంచనాల మధ్య విడుదలైన లక్ష్య సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో అందరూ ఒక్కసారిగా నిరాశ చెందారు. అంతేకాదు ఈ సినిమా కలెక్షన్ల ను చూసి అభిమానులు కూడా పూర్తిస్థాయిలో నిరాశ చెందడం  గమనార్హం. ఆకాష్ పూరీ నటించిన రొమాంటిక్ సినిమా హీరోయిన్ కేతికశర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.. ఈ సినిమాకు నిర్మాతలు గా సోనాలి నారంగ్  సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమా ఎల్ ఎల్ పీ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై నారాయణ దాస్ కే నారాంగ్, శరత్ మరార్ , పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మాతగా వ్యవహరించారు. లవ్ స్టోరీ లాంటి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న ఈ నిర్మాతలు ఈ సినిమాపై కొంతవరకు అంచనాలే పెట్టుకున్నారు..కానీ  కలెక్షన్లు మాత్రం సరిగ్గా రాలేదనే చెప్పాలి.


ఒకసారి మనం క్లోజింగ్ కలెక్షన్లను కనుక చూసుకున్నట్లయితే..
నైజాం - రూ.0.68 కోట్లు
సీడెడ్ - రూ.0.26 కోట్లు
ఉత్తరాంధ్ర - రూ.0.29 కోట్లు
ఈస్ట్ - రూ.0.15 కోట్లు
వెస్ట్ - రూ.0.11 కోట్లు
గుంటూర్ - రూ.0.16 కోట్లు
కృష్ణా - రూ.0.21 కోట్లు
నెల్లూర్ - రూ.0.08 కోట్లు
ఏపీ + తెలంగాణా కలిపి రూ.1.94 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ - రూ.0.12 కోట్లు
వరల్డ్ వైడ్ - రూ.2.06 కోట్లు


ఇక మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా రూ.6.60 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.. కానీ ముగిసే సరికి రూ.2.06 కోట్లను మాత్రమే రాబట్టింది. మొత్తంగా చూసుకుంటే రూ. 4.54 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: