కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ వినోద్ డైరక్షన్ లో చేస్తున్న సినిమా వాలిమై. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో కూడా ఓకేసారి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కోలీవుడ్ యాక్షన్ హీరోగా బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అజిత్ తన ప్రతి సినిమాతో అక్కడ రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇక వినోద్ డైరక్షన్ లో రాబోతున్న వాలిమైతో మరోసారి ఫ్యాన్స్ ను అలరించాలని చూస్తున్నాడు.

వాలిమై సినిమాను తెలుగులో బలం టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. 2022 జనవరి 13న ఈ సినిమా తమిళం తో పాటుగా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో అజిత్ కి విలన్ గా తెలుగు యువ హీరో కార్తికేయ నటించాడు. ఓ పక్క హీరోగా చేస్తూనే విలన్ గా కూడా నటిస్తున్నాడు కార్తికేయ. ఆల్రెడీ తెలుగులో నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో కార్తికేయ విలన్ గా నటించాడు. ఇప్పుడు అజిత్ సినిమాలో విలన్ గా అదరగొట్టనున్నాడు.

డైరక్టర్ వినోద్ తో అజిత్ ఆల్రెడీ నెర్కొండ పర్వై సినిమా చేశాడు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఆ సినిమా తో హిట్ ఇవ్వడంతో వినోద్ కు మరో ఛాన్స్ ఇచ్చాడు అజిత్. ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మించారని తెలిసిందే. మొత్తానికి వాలిమై కేవలం తమిళ ఆడియెన్స్ కు మాత్రమే కాకుండా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. పొంగల్ రేసులో RRR, రాధే శ్యాం రిలీజ్ అవుతుండగా అజిత్ బలం ఏమేరకు బాక్సాఫీస్ దగ్గర బలం చూపిస్తుందో చూడాలి. అజిత్ కు తెలుగు లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్నా రిలీజ్ టైం లో రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు వస్తుండటం వల్ల బలం సినిమాకు ఏమేరకు ఓపెనింగ్స్ వస్తాయో చూడాలి.  





మరింత సమాచారం తెలుసుకోండి: