బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అయినప్పటికీ బిగ్బాస్ కార్యక్రమానికి మాత్రం ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. కేవలం ఒక్క భాషలో మాత్రమే కాదు అన్ని భాషలలో కూడా బిగ్బాస్ కార్యక్రమం సూపర్ హిట్ అయింది అని చెప్పాలి. మొదట హిందీ భాషలో బిగ్బాస్ కార్యక్రమం ప్రారంభం అయింది. అక్కడ బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించింది టాప్ రేటింగ్ సొంతం చేసుకోవడంతో ఆ తర్వాత తమిళంలో బిగ్ బాస్ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. ఇక అటు వెంటనే తెలుగులో కూడా ఈ బిగ్ సెలబ్రిటీరియాలిటీ షో ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. మొదటి సీజన్ నుంచి కూడా తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్  కార్యక్రమం  టాప్ రేటింగ్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది.


 బిగ్ బాస్  కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు హౌస్ లోకి కంటెస్టెంట్ కి వెళ్తారు. వంద రోజుల పాటు హౌస్ లో ఉండడానికి ఇక పోరాటం చేస్తూ ఉంటారు. అయితే సినీ సెలబ్రిటీలు ఎక్కడైనా ఈవెంట్లో కనిపించినప్పుడు ఎలా ఉంటారో అందరికీ తెలుసు.. కానీ నిజ జీవితంలో ఎలా ఉంటారు అని తెలుసుకోవడానికి  బిగ్ బాస్ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇకపోతే ఇటీవల తెలుగు బుల్లితెరపై  బిగ్ బాస్ ఐదవ సీజన్ ఎంతో ఘనంగా ముగిసింది అన్న విషయం తెలిసిందే.  బిగ్ బాస్ ఐదవ సీజన్ లో సన్నీ విజేతగా నిలిచాడు. రన్నరప్గా షణ్ముఖ్ జస్వంత్ గెలిచాడు. అయితే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు మరో రెండు నెలల్లో  బిగ్ బాస్ 6 సీజన్ ప్రారంభం కాబోతుంది అని చెప్పాడు హోస్ట్ నాగార్జున.


 ఈసారి బిగ్ బాస్ షో ఓటిటి  లో ప్రేక్షకులను అలరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆరవ సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా ఎన్నో రోజుల సమయం ఉన్నప్పటికీ ఈ హౌస్ లోకి వెళ్లబోయే కంటెస్టెంట్స్ గురించి ఇప్పటి నుంచే చర్చ జరగడం మొదలయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కొంతమంది పేర్లు హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. యాంకర్ వర్షిని, యూట్యూబ్ యాంకర్ శివ, సోషల్ మీడియా స్టార్ వైష్ణవి చైతన్య, జబర్దస్త్ దొరబాబు, సీరియల్ యాక్టర్ నవ్య స్వామి, ఢీ షో విన్నర్ రాజు  బిగ్ బాస్ ఆరవ సీజన్లో కంటెస్టెంట్ గా వెళ్లపోతున్నట్లు తెలుస్తోంది. బిగ్బాస్ నిర్వాహకులు వారిని సంప్రదించగానే ఓకే చెప్పినట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం అటు బిగ్ బాస్ షో ప్రారంభమైన తర్వాతే తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: