టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండటంతో పాటు తన పోస్టుల ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అలాగే విడాకుల ప్రకటన తర్వాత సమంత కెరీర్ పరంగా బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఇక కొన్ని విషయాలకు సంబంధించి సమంత ఘాటుగా స్పందిస్తుండగా సమంత పోస్టుల గురించి నెటిజన్ల నుంచి అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఇక సమంత చైతన్య జంట విడిపోతుందని అభిమానులు అస్సలు భావించలేదు. ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉందని ఈ జంట విడిపోయే అవకాశాలు కూడా దాదాపుగా లేవని చాలామంది కూడా అనుకున్నారు.చైసామ్ మధ్య మనస్పర్ధలు ఉన్నాయని కూడా గతంలో ఎలాంటి వార్తలు రాలేదు. అయితే సడెన్ గా ఎవరూ ఊహించని విధంగా చైతన్య సమంత విడిపోతూ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చారు.

ఫ్యామిలీమేన్ వెబ్ సిరీస్ వల్లే చైసామ్ మధ్య గొడవలు వచ్చాయని ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. అయితే చైసామ్ మాత్రం విడాకుల ప్రకటనకు సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.ఇక విడాకుల ప్రకటన తర్వాత వైరల్ అయిన ఫేక్ వార్తల గురించి కూడా సమంత సీరియస్ గా రియాక్ట్ అయిన విషయం తెలిసిందే.ఇక తాజాగా సమంత ప్రముఖ రచయిత ఫరీదా డీ కోట్స్ ను పోస్ట్ చేయడం జరిగింది. కూతుళ్లకు కొన్ని విషయాలలో అనేక నిబంధనలు విధించి కట్టడి చేసే ముందు కొడుకులకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని సమంత అన్నారు. అలాగే మహిళలను కూడా లైంగికంగా వేధించకుండా కొడుకులను పెంచాలని సమంత సూచించారు. ఇక కూతుళ్లను కొన్ని విషయాలలో అడ్డుకోవడం ఒక విధంగా దాడి చేసినట్టేనని ఆమె చెప్పుకొచ్చారు. అయితే సమంత ఎవరిని ఉద్దేశించి ఆ పోస్ట్ పెట్టారో అసలు క్లారిటీ లేదు.సామ్ ఇక తన పోస్టుల ద్వారా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారని ఆమె అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: