సినీ ఇండస్ట్రీలో నటీనటులకు, సినిమాలకు వచ్చే అరుదైన గౌరవం ‘ఆస్కార్’ అవార్డు ప్రదానోత్సం. హాలీవుడ్‌లో చాలా వరకు సినిమాలు కేవలం ఆస్కార్ అవార్డులో నామినేట్ అవ్వడానికే ప్రయత్నాలు చేస్తుంటారు. సినిమా కథాంశం, నటన, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటీనటులు, ఉత్తమ చిత్రం ఇలా చాలా విభాగాల్లో ఆస్కార్ అవార్డులు ప్రదానం చేస్తుంటారు. ఈ అవార్డు సాధిస్తే ఎంతో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ‘జేమ్స్ బాండ్’ సినిమాలకు ఎంతో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పటి వరకు ఈ జేమ్స్ బాండ్ సిరీస్‌లో దాదాపు 25 వరకు సినిమాలు వచ్చాయంటే అర్థం చేసుకోండి. ఈ సినిమాకు ఏ రేంజ్‌లో అభిమానులు ఉంటారో.. కేవలం హాలీవుడ్‌కే పరిమితం కాకుండా.. తెలుగు భాషల్లోనూ ఈ సిరీస్ సినిమా విడుదల అవుతుంటాయి.



ఇటీవల విడుదలైన జేమ్స్ బాండ్ సిరీస్‌లో డేనియల్‌ క్రెగ్‌ హీరోగా ‘నో టైం టు డై’ టైటిల్‌తో సినిమా విడుదలైంది. ఈ సినిమాను మోట్రో గోల్డెన్‌ మేయర్‌, ఇయోన్ ప్రొడక్షన్స్‌ సంస్థల సంయుక్తాధ్వర్యంలో.. దాదాపు రూ.2,000 కోట్ల బడ్జెట్‌తో సినిమాను రూపొందించారు. దర్శకుడిగా జోజీ ఫకునగా.. ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమాను చిత్రీకరించారు. వరల్డ్స్ మోస్ట్ అవెయిట్ మూవీ ‘నో టైం టు డై’ సినిమా పోయిన ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా భారీ వసూళ్లనే కొల్లగొట్టింది.

ఇప్పటివరకు దాదాపు 100 మిలియన్లకు పైగా కలెక్షను సాధించిన ఈ సినిమా ప్రస్తుతం.. ఆస్కార్ బరిలో నిలిచింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అధికారికంగా వెల్లడించింది. 94 విభాగాల్లో ఆస్కార్ అవార్డులు అందజేస్తుండగా.. ప్రస్తుతం దాన్ని 10కి కుదించినట్లు పేర్కొంది. ఇందులోని 4 విభాగాల్లో జేమ్స్ బాండ్ మూవీ ‘నో టైం టు డై’ సినిమాను ఎంపిక చేశారు. ఆస్కార్ బరిలో 10 కేటగిరీల్లో 4 కేటగిరీలు ఒకే సినిమాకు రావడం విశేషం. మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్, మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్), మ్యూజిక్ (ఒరిజినల్ సాంగ్ – మూవీ టైటిల్ సాంగ్), సౌండ్ ఇలా 4 కేటగిరీలు ఎంపిక చేశారు. ఇందులో జేమ్స్ బాండ్ మూవీ ఎన్ని కేటగిరీలు సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: