ఆయన ఏం మాట్లాడినా అదో సెన్సేషన్.. ఇక సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా  అది ఒక కాంట్రవర్సీ.. ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు సెలబ్రిటీలు అందరూ.. మనసులో అనిపించింది మాట్లాడుతూ సెన్సేషనల్ గా మారి పోతూ ఉంటాడు ఆయన. ఇక ఆయన చేసే కామెంట్స్ కి తిట్టుకునే వారు కొంత మంది ఉంటే.. ఒక్కరోజు అయినా ఆయనలా ఉండాలి అనుకునే వారు మరికొంతమంది. సినిమాల్లో తక్కువగా కాంట్రవర్సీ లతో ఎక్కువగా సోషల్ మీడియా లో పాపులర్ గా మారిపోతూ ఉంటాడు అయన. ఒకప్పుడు సెన్సేషన్ సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రస్ కానీ ఇప్పుడు సెన్సేషనల్ కాంట్రవర్సీ లకు ఆయన చిరునామా. ఇంతలా చెబుతున్నానంటే మీకు ఆయన ఎవరో అర్థమయ్యే ఉంటుంది. ఇంకెవరు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రాంగోపాల్ వర్మ.


 పెళ్లంటే నరకం అంటూ చెప్పి యూత్ని ఆకర్షించిన రాంగోపాల్ వర్మ తన పోస్టులతో ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంటాడు. రామ్ గోపాల్వర్మ సోషల్ మీడియా ఖాతాల నుంచి ఎప్పుడు ఎలాంటి ఎలాంటి ట్విట్ రిలీజ్ అవుతుంది అన్నదిప్రేక్షకుల ఊహకందని విధంగానే ఉంటుంది. సాధారణంగా ఏదైనా పండగ దినాలలో శుభాకాంక్షలు చెప్పడానికి రాంగోపాల్ వర్మ అస్సలు ఇష్టపడరు. ఒకవేళ చెప్పిన తనదైన శైలిలో చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు రాంగోపాల్ వర్మ. ఇప్పుడూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాడు.


 వర్మ ఏంటి.. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా.. ఇక వర్మ ఏది చేసిన కాస్త సపరేట్ గానే ఉంటుంది కదా.. ఇక ఇప్పుడు శుభాకాంక్షలు కూడా కాస్త డిఫరెంట్ గానే చెప్పేసాడు. మీకు అంబానీ కి మించిన ఇల్లు డబ్బులు రావాలి. అమ్మాయిలకు అందమైన అబ్బాయి లు.. అబ్బాయి లకు అందమైన అమ్మాయిలు దొరకాలి. భర్తలను భార్యలు వేధించకూడదు. చిన్న సినిమాలు బాహుబలి అంత పెద్ద హిట్ కావాలి. ఇక ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచాలి. నన్ను ద్వేషించే వారి కోసం నేను త్వరగా చనిపోవాలి అని రాంగోపాల్ వర్మ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది చూశాక వర్మ మళ్లీ వేసేసాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు ఎంతో మంది నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rgv