బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అఖండ. బోయపాటి శ్రీను తీసిన ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించగా థమన్ దీనికి సంగీతాన్ని అందించారు. అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ ని అమితంగా ఆకట్టుకున్న అఖండ దాదాపుగా అనేక ప్రాంతాల్లో మంచి కలెక్షన్ రాబట్టింది. బాలయ్య రెండు రోల్స్ లో అదరగొట్టే నటనతో పాటు హీరోయిన్ ప్రగ్య అందం, అభినయం, థమన్ అందించిన సాంగ్స్, బీజీఎమ్, బోయపాటి అద్భుత దర్శకత్వ ప్రతిభ అఖండ కి విజయాన్ని అందించాయి.
ముఖ్యంగా మంచి మాస్ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు బోయపాటిసినిమా ద్వారా హిట్ కొట్టి మళ్ళి ఫామ్ లోకి వచ్చారు. ఇక మరోవైపు ఎప్పటి నుండి మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న బాలయ్యకి కూడా అఖండ సక్సెస్ మంచి ఊపును అందించింది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని ఎంతో భారీ వ్యయంతో నిర్మించారు. పూర్ణ, శ్రీకాంత్, కాలకేయ ప్రభాకర్, జగపతి బాబు, సుబ్బరాజు తదితరులు ఇతర పాత్రలు చేసిన ఈ సినిమా రెండు రోజుల క్రితం సక్సెస్ఫుల్ గా 50 పూర్తి చేసుకోగా ఆ సందర్భంగా వేడుకల్ని హైదరాబాద్ లోని ప్రముఖ థియేటర్ అయిన సుదర్శన్ లో ఘనంగా నిర్వహించారు యూనిట్ సభ్యులు.

ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే, అఖండ సినిమాని మొన్న సాయంత్రం ప్రముఖ ఓటిటి మాధ్యమం డిస్నీ హాట్ స్టార్ ద్వారా ఓటిటి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. కాగా ఈ సినిమా గడచిన 24 గంటల్లో అత్యధికులు వీక్షించిన సినిమాగా ఒక గొప్ప రికార్డు ని సొంతం చేసుకుందని కొద్దిసేపటి క్రితం పలువురు సినీ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇప్పటివరకు మరే తెలుగు సినిమాకి రానన్ని వ్యూస్ అఖండ దక్కించుకుందని, చూడబోతే ఈ సినిమా రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా వ్యూస్ ని రాబట్టే అవకాశం కనబడుతోందని వారు అంటున్నారు. మొత్తంగా అటు థియేటర్స్ లోనే కాక ఇటు ఓటిటి లో కూడా తన హవా చూపిస్తూ అఖండ దూసుకెళ్తుండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: